సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టో అంటే.. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్ని స్తుంది. పైగా మూడోసారి అధికారంలోకి రావాలని గట్టిగా సంకల్పం చెప్పుకొన్న ప్రధాని మోడీ.. ఆయన పార్టీ బీజేపీలు ప్రజలను చేరువ చేసుకునేందుకు అన్ని రూపాల్లోనూ వ్యూహాలు రెడీ చేస్తుంది. ఇలానే అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో బారీ ఎత్తున ఉచితాలు ఇచ్చేందుకు.. పేదలను, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని లెక్కలు వేసుకున్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తీసుకువచ్చిన మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచితా లను మించి.. బీజేపీ ఏమైనా ప్రకటిస్తుందా? అని కూడా అంచనాలు వేసుకున్నారు. కానీ.. బీజేపీ తాజాగా ప్రకటించిన “సంకల్ప పత్ర“ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా.. ఉచిత పథకంలేకపోవడం గమనార్హం. ఉచిత రేషన్ అనేది.. కరోనా సమయం నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఇది కొత్తది కాదు. ఇక, ముద్ర రుణాలు.. స్వయంఉపాది ప్రోత్సాహకం వంటివి కూడా.. కేవలం రాయితీలతోనే సరిపుచ్చారు.
ఇక, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పిన బీజేపీ.. రైతుల రుణ మాఫీపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదేవిధంగా ప్రస్తుతం ఇస్తున్న పిఎం కిసాన్ యోజన నిధులు(6వేలు) పెంచుతామని కూడా.. ప్రకటన చేయలేదు. అదేవిధంగా అంగన్‌వాడీల జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా.. దీనిని కూడా పక్కన పెట్టింది. ఇక, ఉద్యోగులు ఆశిస్తున్న పన్ను పరిధిని పట్టించుకోలేదు. సీపీఎస్ రద్దు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను, రైతులు ఆశించిన(ఇటీవల ఉద్యమాలు కూడా చేశారు) మద్దతు ధరలకు చట్ట బద్ధతను కూడా.. బీజేపీ తన మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొనలేదు.
మొత్తంగా చూస్తే.. ఇది ఫక్తు.. బీజేపీ మేనిఫెస్టో. అంటే.. ఉచితాలు. తాయిలాలు కాకుండా.. దేశాన్ని అభి వృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు మోడీ లక్షిత 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారానికి ఉద్దేశించిన మేనిఫెస్టోనే కళ్లకు కట్టింది. ప్రస్తుతం ఉన్న పథకాలనే దాదాపు కొనసాగిస్తున్నారు. కొత్త గా తీసుకువ చ్చిన వాటిలో సూర్య ఘర్ యోజన, దివ్యాంగులకు ప్రత్యేక ఇళ్ల నిర్మాణం(ఉచితం కాదు.. సబ్సిడీ మాత్రమే), విదేశాల్లో భారతీయ భద్రతకు హామీ వంటివి మాత్రమే ఉన్నాయి. మొత్తంగా బీజేపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే.. అభివృద్ధి మంత్రమే కనిపిస్తోంది.
This post was last modified on April 14, 2024 11:29 am
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…