ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను కుదుపుగా మారిన సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఔను ఒకటి కాదు.. ఆయనపై రెండు దఫాలుగా రాళ్లు పడ్డాయి. ఒకటి గజ మాల వేస్తున్న సమయంలో తర్వాత.. కొంత దూరం వెళ్లిన తర్వాత.. ఈ రెండు దాడుల్లో మొదటి దాన్ని లైట్ తీసుకున్నారు. దండలో ఏదో తగిలి ఉంటుందని అనుకున్నారు. కానీ.. తర్వాత.. గట్టిగానే రాయి నేరుగా వచ్చి తగిలింది. దీంతో సీఎం జగన్ తలకు స్వల్ప గాయం అయింది. అయితే.. వైద్యులు చెబుతున్న మేరకు.. నరానికి బలంగానే తగిలింది.
కట్ చేస్తే.. ఇది రాజకీయ హంగామాకు దారి తీసింది. జగన్ కావాలనే నాటకం ఆడుతున్నారని టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇది కోడికత్తి దాడి 2.0గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో కావాలనే దాడులు చేయించుకుని.. దీనిని సానుభూతి కోణంలో చూపించి విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నదివారి ఆరోపణ. దీనికి 2019 ఘటనను తెరమీదికి తెచ్చారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా చేయించుకున్న దాడేనని చెబుతూ.. కొన్ని రీజన్లు కూడా తెరమీదికి తెచ్చారు.
మరి ఇది నిజమా? రాళ్లు వేయించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారా? అనేది ప్రశ్న. ఇదే నిజమని అనుకుంటే.. 2.63 లక్షల కోట్లను ప్రజలకు ఆయన పంచాల్సిన అవసరం ఏముంది? అప్పులు చేసి.. ప్రతిపక్షాల నేతలతో విమర్శలు ఎదుర్కొనాల్సిన అవసరం ఏముంటుంది. ఏదో ఒక రకంగా.. కాలం గడిపేసి.. ఎన్నికలకు ముందు రాళ్లు – రప్పలతో దాడులు చేయించుకుని.. దానిని ఎన్నికల సానుభూతిగా చూపించి గెలుపు గుర్రం ఎక్కొచ్చుకదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒక కాకికి ఏదైనా హాని జరిగినప్పుడు.. ఇతర కాకులు.. అన్నీ పోగై.. అరుపులు కేకలతో సానుభూతి చూపిస్తాయి. కానీ, మారిన రాజకీయ పరిణామాలతో ఏం జరిగినా.. దానిని మరో కోణంలో చూసే పరిస్థితి దేశవ్యాప్తంగా మారిపోయింది. దీంతో విపక్షాల విమర్శలను ఈ కోణంలోనే చూడాల్సి వస్తోంది. సానుభూతి రాజకీయాలు రాజ్యమేలుతున్నంత వరకు.. నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కొనక తప్పదు. కానీ, ఎవరూ కూడా.. ఉద్దేశ పూర్వకంగా రాళ్లు వేయించుకోరు.. క్లెమోర్ మైన్లతో దాడులు చేయించుకోరు. ఒకవేళ రాళ్లు వేయించుకోవడం అనేది ఉద్దేశ పూర్వకమేనని అనుకుంటే.. 2008లో చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్ దాడి.. అనంతరం జరిగిన ముందస్తు ఎన్నికలను కూడా.. ఇలానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి .. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
This post was last modified on April 14, 2024 11:18 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…