Political News

సెంచరీ కొట్టగలిగితే చాలనుకుంటున్న వైసీపీ?

2019 ఎన్నికల్లో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ఏకంగా 151 నియోజకవర్గాల్ని వైసీపీ గెలిచింది. మళ్ళీ అలాంటి విక్టరీ సమీప భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పార్టీకి సాధ్యమా.? అంటే, ఏమో.. చెప్పలేం.!

కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార వైసీపీ, వై నాట్ 175 అంటోంది.! అదే దిశగా ఎన్నికల కార్యాచరణని, దాదాపు ఏడాది క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగులతో మొదలైంది ఈ ప్రసహనం. గడప గడపకీ వైసీపీ సహా అనేక కార్యక్రమాలు ఈ కోవలో ప్రారంభమైనవే.

అయితే, ఇంటింటికీ వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళుతోంటే, ఎదురైన చీత్కారాల నేపథ్యంలో వైసీపీలో కొంత నీరసం ఆవరించింది. ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చేశాయ్.! ఇప్పటికీ వైసీపీ నేతలు కొందరు ‘వై నాట్ 175’ అంటున్నా, లోలోపల వంద గెలిస్తే చాలనుకుంటున్నారు.

వంద కూడా కాదు, 90 సీట్లు గెలిచి, అధికార పీఠమెక్కితే, ఆ తర్వాత టీడీపీ శాశ్వతంగా సమాధి అయిపోతుందనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ, ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుంది.? అంటే, వైసీపీకి ఏమంత ఆశాజనకంగా కనిపించడంలేదు.

వైసీపీ నుంచి ఎప్పుడైతే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి దూకెయ్యడం ప్రారంభమైందో, అప్పుడే వైసీపీ పతనంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది రాజకీయ పరిశీలకులకి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి వల్ల వైసీపీకి రాజకీయంగా చావు దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.

ఎవరు గెలిచినా, పార్టీ ఫిరాయింపులు అధికార పార్టీలోకి ఎన్నికల తర్వాత అనూహ్యంగా వుండబోతున్నాయి. తెలంగాణలో రాజకీయాల్ని చూస్తున్నాం కదా.! ఎన్నికల వరకు అసలు కాంగ్రెస్ పార్టీ గేమ్‌లోనే లేదు. గులాబీ పార్టీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. లోక్ సభ ఎన్నికలొచ్చేసరికి గులాబీ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి.

అదే పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీకి రాబోతోందా.? అంటే, ఔననే అభిప్రాయాలు అన్ని వైపుల నుంచీ వినిపిస్తున్నాయి. అందుకే, ‘ఎలాగోలా వంద గెలిస్తే చాలు..’ అన్న స్థాయికి వైసీపీ శ్రేణుల ఆలోచనలు పడిపోతున్నాయి.

This post was last modified on April 14, 2024 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

6 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

12 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

15 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

16 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

16 hours ago