కీలకమైన ఎన్నికలకు ముందు.. ప్రత్యర్థి పార్టీల వలకు టీడీపీ చిక్కుకుంటోందనే వాదన వినిపిస్తోంది. సహజంగానే ప్రత్యర్థి పార్టీలు.. ఒక దానిని ఒకటి డైల్యూట్ చేసుకునేలా రాజకీయాలు చేస్తుంటాయి. ఇవి కామన్. అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. స్పందించక తప్పని పరిస్థితులు కల్పించేలా చేయడం వంటివి రాజకీయంగా ఎప్పుడూ తెరమీదికి వస్తుంటాయి. అయితే.. ఇలాంటి సమయంలో కాస్త సంయమ నం పాటించి.. ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకోకుండా.. నాయకులు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయంలో చంద్రబాబు తొందరపడుతున్నారు.
గత 2019లో జరిగిన అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయం లో అన్నా క్యాంటీన్ల వ్యవహారాన్ని టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అప్పటికి ఆరు మాసాల ముందు మాత్రమే క్యాంటీన్లను తెరిచిన నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వస్తే.. అన్నా క్యాంటీన్లు ఉండవని.. పేదలు ఆకలితో మాడి పోతారని.. టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఎందుకంటే.. రూ.5 కే ఉదయం టిఫిన్, రూ.5కే మధ్యాహ్నాం, రాత్రి భోజనం అందించాయి.
ఇది ప్రజలకు బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా రోజు వారి పనులు చేసుకునే కార్మికులకు, ఆటో డ్రైవర్ల కు, నిరుద్యోగులకు, విద్యార్థులకు.. ఉద్యోగులకు కూడా అన్నక్యాంటీన్లు చేరువయ్యాయి. దీనిని టీడీపీ కార్నర్ చేస్తూ.. ఎన్నికల ప్రచారంలోకి తీసుకుంది. అయితే.. ఎంత రెచ్చగొట్టినా.. వైసీపీ అన్నాక్యాంటీన్ల జోలికి మాత్రం పోలేదు. ఉంచుతామని కానీ, తీసేస్తామని కానీ, చెప్పలేదు. ఒకరిద్దరు మాత్రం ఉంచుతామని చెప్పినా.. దీనిపై పార్టీ అధినేత జగన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కమాట మాట్లాడలేదు.
ఇక, అదికారంలోకి వచ్చిన తర్వాత.. అన్నా క్యాంటీన్లను మూసేయించారు. కట్ చేస్తే.. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ వ్యవహారంలో వైసీపీ ప్రచారం చేస్తోంది. తాము లేకపోతే..ఈ వ్యవస్థ ఉండదని.. చంద్రబాబు అధికారంలోకివస్తే.. మూసేస్తారని సీఎం జగన్ ప్రచారంలోకి తెచ్చారు. దీంతో ఆదుర్దా పడిన చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయిపోయారు. తాము వచ్చినప్పటికీ.. వలంటీర్ల వ్యవస్థ ఉంటుందని.. వారి జీతాలను రూ.10 లకు పెంచుతామని చెప్పారు.
అయితే.. ఇది మంచిదే కదా! అని అనుకోవచ్చు. కానీ, ఇక్కడే వైసీపీ యాంటీ ప్రచారం చేస్తోంది. గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఫలితంగా … చంద్రబాబు చేసిన ప్రకటన ల కంటే కూడా.. గతంలో చేసిన విమర్శలే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఇమే జ్‌పై మరోసారి ఇబ్బందులు వచ్చాయి. అసలు ఆయన స్పందించకుండా ఉండి ఉంటే సరిపోయేది కదా! అంటున్నారు టీడీపీ నాయకులు.
This post was last modified on April 10, 2024 3:10 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…