ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చుల కోసం పార్టీకి విరాళాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుల, మత ప్రాతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడి నుంచి కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి ఇతోధికంగా సాయం చేయాలని ఆయన కోరారు. కార్మికుడి నుంచి కర్షకుడి వరకు, ఉద్యోగి నుంచి పారిశ్రామిక వేత్త వరకు ప్రతిఒక్కరూ కదిలి రావాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి ఇచ్చే విరాళం .. తెలుగు నేలకు ఇస్తున్నట్టేనని.. తెలుగు జాతిని సంరక్షించేందుకు ఇస్తున్నట్టేనని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించారు. (https://tdpforandhra.com) టీడీపీఫర్ ఆంధ్రా.కామ్ ద్వారా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ నుంచి అయినా.. పార్టీకి విరాళాలు ఇవ్వవచ్చన్నారు. రూ.100 నుంచి ఎంతైనా విరాళం ఇచ్చి.. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చేవారికి అకౌంటబిలిటీ ఉంటుందన్నారు. ఎంత మొత్తం విరాళంగా ఇచ్చినా రసీదులు ఇస్తామన్నారు. దీనిని 80సీ కింద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, తొలి చందాగా..చంద్రబాబు రూపాయి తక్కువ రూ.లక్ష పార్టీకి ఇచ్చారు.
వైసీపీపై విమర్శలు
ఈ సందర్భంగా చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. తాము అధికారికంగా విరాళాలు సేకరిస్తున్నామ న్నారు. అంతా వైట్ మనీనే తీసుకుంటున్నామని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం బ్లాక్ మనీని కూడా విరాళంగా తీసుకుం టోందని తెలిపారు. పేకాట క్లబ్బులు, గుర్రపు పందేల క్లబ్బులు, క్యాసినోల నుంచి కూడా వైసీపీ దొడ్డిదారిలో విరాళాలు సేకరిస్తోం దని చంద్రబాబు దుయ్యబట్టారు. గ్యాంబ్లింగ్ వాళ్ల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించిన వైసీపీ.. దీనిని ఏకంగా అధికారికం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శలు గుప్పించారు. కాగా, అమెరికా సహా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా టీడీపీకి విరాళాలు ఇవ్వవచ్చని చంద్రబాబు సూచించారు.
This post was last modified on April 9, 2024 9:52 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…