కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. శపథం నెరవేర్చుకున్నారు. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. అవును.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను ఖాళీ చేస్తానన్న ఆయన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇప్పుడు ఇది కూడా చేజారిపోయింది.
బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి ఇప్పుడు అనుకున్నది సాధించారు. గత తెలంగాణ ఎన్నికలకు ముందు ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ లీడర్‌ను అసెంబ్లీ గేటు తాకనీయనని పొంగులేటి శపథం చేశారు. ఆ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ గెలిచింది. ఒకటేమో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న సీపీఐ సొంతం చేసుకుంది. ఇక భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెల్లంను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన పొంగులేటి అనుకున్నది సాధించారు.
నిజానికి పొంగులేటి అనుచరుడైన తెల్లం వెంకట్రావు కూడా ఆయనతో పాటు మొదట కాంగ్రెస్‌లో చేరారు. కానీ భద్రాచలం కాంగ్రెస్ టికెట్ పోదెం వీరయ్యకు ఇవ్వడంతో తెల్లం తిరిగి బీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి నుంచే కాంగ్రెస్‌లో చేరేందుకు తెల్లం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పార్టీ మారారు. అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం నింపి, కార్యకర్తలు, నాయకులు జంప్ కాకుండా చూడటంలో కేసీఆర్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ క్రమంగా ఖాళీ అవుతుండటమే అందుకు రుజువని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:29 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…