సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. షెడ్యూల్ విడులకు కొద్ది నెలల ముందే ఏపీలో రాజకీయం ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంతనే అధికార.. విపక్ష అధినేతలతో సహా ముఖ్యనేతలంతా వరుస పెట్టి సభల్ని నిర్వహిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మాటలతో మరింత మంట పుట్టేలా చేస్తున్నారు. ఏపీ అధికార పక్షం ఒంటరిగా పోటీ చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో బీజేపీ.. జనసేనలు కలిసి కూటమిగా మారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కూటమి మధ్య పొత్తు కుదిరిన తర్వాత తమ తొలి బహిరంగ సభను చిలకలూరిపేటలో నిర్వహించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధులంతా హాజరయ్యారు. అయితే.. ఈ సభ ద్వారా ఆశించినంత మైలేజీ కూటమికి రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఎవరికి వారుగా మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎవరికి వారుగా సభల్ని నిర్వహిస్తున్నారు. సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. ఇలా ఒక్కొక్కరిగా ప్రచారం చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని.. మైలేజీని మరింత పెంచేందుకు వీలుగా ఇప్పుడు అనుసరిస్తున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి సభలకు హాజరవుతారని చెబుతున్నారు. సింగిల్ గా ప్రచారం కంటే కూడా కలిసి ప్రచారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఎన్నికలు అధికార పక్షానికి మాత్రమే కాదు విపక్షాలకు అత్యంత కీలకం కావటంతో ప్రచారం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు.. పవన్ లు నిర్వహిస్తున్న సభలకు ఆశించినంతగా స్పందన లేదంటున్నారు. ఆశించినంత ఎఫెక్టు రాకపోవటమే కాదు.. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలకు భారీగా ప్రజలు వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అందుకే.. సింగిల్ గా కాకుండా జంటగా కలిసి ప్రచారం చేయటం ద్వారా ఓటర్లకు మరింత దగ్గర కావొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మరెప్పుడు ఆ నిర్ణయం బయటకు వస్తుందో చూడాలి.
This post was last modified on April 8, 2024 11:20 am
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…