తెలంగాణలో అధికారంలోకి వచ్చిన జోష్‌తో ఉన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ప్రకటించింది.
శ్రీగణేష్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో గద్దర్ కుటుంబానికి, అద్దంకి దయాకర్‌కు పార్టీ షాక్ ఇచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున దివంగత గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలిచారు. అప్పుడు శ్రీగణేష్ బీజేపీ నుంచి పోటీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ నుంచి మరోసారి వెన్నెల పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు ఈ టికెట్‌పై అద్దంకి దయాకర్ కూడా ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించిన దయాకర్‌కు పార్టీ మొండిచేయి చూపించింది. ఎమ్మెల్సీ టికెట్ కావాలనుకున్నా దొరకలేదు. దీంతో కంటోన్మెంట్ టికెట్ కోసం ఇప్పుడు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా మరోసారి పార్టీ ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో అటు గద్దర్ కుటుంబాన్ని గత ఎన్నికల్లో పార్టీ వాడుకుని వదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి. దయాకర్‌కు కూడా అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సారి కంటోన్మెంట్‌లో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే శ్రీగణేష్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ కంటోన్మెంట్‌లో బీజేపీ నుంచి శ్రీగణేష్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన 41,888 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వెన్నెలకేమో 20 వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సారి మరింతగా కష్టపడితే శ్రీగణేష్‌ను గెలిపించుకోవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on April 7, 2024 4:46 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…