తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడి గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఆయన.. ఇప్పుడు కూడా అదే జోరుతో సాగిపోతున్నారనే చెప్పాలి. ఓ వైపు పాలన వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలకు తనదైన స్టైల్లో బదులిస్తున్నారు. తాజాగా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ స్పీచ్ మాత్రం మరో లెవల్‌లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాటలు, ప్రాసలు, పంచ్‌లు కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి.
ఈ సభలో రేవంత్ స్పీచ్‌తో కాంగ్రెస్ కార్యకర్తల రోమాలు నిక్కబొడుచుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ప్రధాన బలమైన కార్యకర్తల గురించి ప్రస్తావించి రేవంత్ మార్కులు కొట్టేశారు. పార్టీ కోసం పగలు రాత్రి లేకుండా దేనికీ భయపడకుండా క్యాడర్ పని చేస్తుందని, పార్టీ జోలికి వస్తే ఎవరినైనా తరిమి తరిమి కొడతారని రేవంత్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడాలని కార్యకర్తల రక్తం మరిగేలా రేవంత్ మాటలు పేలాయి.
ఇక బీఆర్ఎస్‌పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు. ఇటీవల పొలం బాట పేరుతో జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో రేవంత్ రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లారని.. అందుకే కేసీఆర్‌కు కష్టం వచ్చిందని సంయమనం పాటించామని ఇక ఊరుకునేది లేదని రేవంత్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం సృష్టించారని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఇదే దూకుడుతో సాగితే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 7, 2024 4:42 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…