Political News

వ‌లంటీర్ల క‌ట్ట‌డి.. ఎవ‌రికి ఎఫెక్ట్‌?!

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోయింది. ఇది కాద‌న్నా.. నిజం. అందుకే.. ఆదిలో వలంటీ ర్ల‌పై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు కూడా.. త‌ర్వాత వెన‌క్కి త‌గ్గాయి. వ‌లంటీర్ల‌లో త‌ప్పులు చేసే వారు ఉన్నారు. దీనిని కూడా ఎవ‌రూ కాద‌న‌రు. అలాగ‌ని అసలు వ్య‌వ‌స్థ‌పైనే మర‌కలు వేసేప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేదు దీంతో చంద్ర‌బాబు స‌హా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా వెన‌క్కి త‌గ్గారు.

అంతేకాదు.. చంద్ర‌బాబు ఏకంగా తాము అధికారంలోకివ‌చ్చాక కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. వారికి నెల‌నెలా రూ.50 వేలు ఆదాయం వ‌చ్చేలా చేస్తామ‌ని వాగ్దానం చేశారు ఇక‌, ప‌వ‌న్ కూడా.. తాను వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకం కాద‌ని.. ఎవ‌రో ఒక‌రిద్దరు చేసిన త‌ప్పులు అంద‌రికీ అంటుతున్నా య‌ని  వ్యాఖ్యానించారు.  మ‌రోవైపు.. వైసీపీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌లో వ‌లంటీర్ల‌పైనే ఆధార‌ప‌డింది. వారి ద్వారా ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకుంది.

ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తిపక్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌ను వైసీపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. వ‌లంటీర్ల‌కు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ్య‌తిరేకుల‌ని, రేపు ప్ర‌భుత్వం మారితే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఉండ‌ద‌ని.. ఇది మీకు ఇబ్బందులు తెస్తుంద‌ని కూడా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నాటుకునేలా చేసింది. దీనిని చంద్ర‌బాబు కానీ, ప‌వ‌న్ కానీ. పూర్తిస్థాయిలో గ్ర‌హించ‌లేక పోయారు. దీంతో కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. వలంటీర్ల‌ను తీసేస్తార‌నే చ‌ర్చ గ్రామీణ ప్రాంతాల్లో జ‌రిగింది. జ‌రుగుతోంది కూడా.

ఇదిలావుంటే.. తాజాగా  కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల‌కు దూరం చేసింది. దీనిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల ప్ర‌మేయం లేద‌నేది ఆ రెండు పార్టీల వాదన‌. కేవ‌లం మాజి ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ(సీఎఫ్‌డీ)గా ఏర్ప‌డి వ‌లంటీర్ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో వారిని ఎన్నిక‌ల విధుల‌కే కాదు.. అస‌లు ఏ ప‌నికీ వాడొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది.

అయితే.. తెర‌చాటున ఏం జ‌రిగింద‌నేది సామాన్యుల‌కు తెలియ‌దు. పైకి మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లే క‌నిపిస్తున్నారు. ఈ విష‌యాన్నే వైసీపీ కూడా ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. ఫ‌లితంగా.. వ‌లంటీర్ల‌పై మ‌న‌సు పెట్టుకున్న ప్ర‌జ‌లు.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌పైనే అక్క‌సుగా ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 6, 2024 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముందస్తు బెయిల్ నాకు వద్దు: చెవిరెడ్డి

వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…

7 hours ago

జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ‌.. ఎందుకీ ఆరాటం?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి కేవలం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోస‌మే ఆరాట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు…

8 hours ago

ఆరో ‘ఆట’ రద్దు.. ఏపీలో ఇకపై 5 ‘ఆట’లే

ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…

9 hours ago

గ్రామాల్లోనే టెంట్లు… వాటిలోనే పవన్ బస

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…

9 hours ago

డాకు మహారాజ్ చాలానే దాచి పెట్టాడు

https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…

10 hours ago

`బ్రాండ్ ఏపీ బిగిన్‌`: చంద్ర‌బాబు

బ్రాండ్ ఏపీ ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అత‌లాకుత‌ల‌మైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామ‌ని చెప్పారు.…

10 hours ago