తాజాగా ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయన.. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇక్కడో ఇంటిని ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉంటానని చెప్పటం తెలిసిందే.
ఎన్నికల నేపథ్యంలో ఆయనో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 54 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో తన నివాసం ఉంటుందని ఆయన చెప్పటం తెలిసిందే. తాను చెప్పినట్లే గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తన ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కనే తన పంట పొలాల్లో అభ్యుదయ రైతుగా పేరున్న ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ భవనాన్ని పవన్ ఉండేందుకు ఎంపిక చేసుకున్నారు.
ఉగాది నాడు ఇంట్లోకి వచ్చేసేందుకు వీలుగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. శుక్రవారం ఈ ఇంటికి సంబంధించిన గృహప్రవేశం పూర్తైంది. జనసేనాని పవన్ ను అమితంగా అభిమానించే నాగేశ్వరరావు తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. మూడు అంతస్తులు ఉన్న ఈ ఇల్లు అయితే.. పార్టీ సమావేశాలకు.. కార్ల పార్కింగ్ కు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. ఇంటికి దగ్గర్లోని హెలిప్యాడ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పవన్ కు అభిమాని అయిన నాగేశ్వరరావు.. తన అభిమాన హీరోకు తన ఇంటిని ఇచ్చేందుకు ఆనందంగా ఓకే చెప్పారు. ఇక.. అద్దె ఎంతంటారా? ఒక్క రూపాయి చాలని.. అంతకు మించి అక్కర్లేదని పవన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.ఉగాది వేడుకల వేళ ఇక్కడ పాల్గొనేందుకు పవన్ వస్తారని చెబుతున్నారు. పవన్ మీద అభిమానంతోనే తన ఇంటిని ఇచ్చేందుకు సిద్దమైన నాగేశ్వరరావును జనసైనికులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త ఇంటిని నిర్మించుకునే వరకు ఈ ఇంట్లో పవన్ ఉంటారు.
This post was last modified on April 6, 2024 9:53 am
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…