ఔను.. ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ ప్రశ్నే ఎదురవుతోంది. మిమ్మ ల్ని ఎలా నమ్మాలండీ అంటూ.. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దీనికి కారణం.. తన ఫోన్ కూడా ట్యాపిం గునకు గురైందని.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. తాము వదిలి పెట్టబోమని.. బీజేపీ ప్రభుత్వం కూసాలు కదిలిస్తుందని భారీ డైలాగులు పేల్చారు. అయితే, ఇప్పటికీ కేంద్రంలో ఉన్నదిబీజేపీనే కదా.. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది జనం టాక్.
ఇంతకీ కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా… బీజేపీ వదలదని అన్నారు.
అయితే.. అసలు కిషన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆయన ఫోన్ ట్యాప్ అయింది.. దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేశారు? కేంద్రంలో ఉన్నదిబీజేపీ ప్రభుత్వమే కదా.. మరి అక్కడే చెప్పి.. అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ ఎస్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనేది ప్రధాన ప్రశ్న. ఇదంతా చూస్తే.. కిషన్ రెడ్డిఏదో గేమ్ ఆడుతున్నారన్న వాదన అయితే.. బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీనిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on April 5, 2024 8:19 pm
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…