ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమో హన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ పరిణామం వైసీపీ ముందుగానే ఊహించిన అంశమే. ఎందుకంటే.. ఆమంచి అభీష్టం వైసీపీలో నెరవేరలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీరాల స్తానాన్ని ఆశించారు. కానీ, వైసీపీ ఆయనకు ఇవ్వలేదు. పైగా.. ఆమంచి బద్ధ శత్రువుకు అప్పగించింది. దీంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఆమంచి.. ఇక, తాజాగా బయటకు వచ్చారు.
రాజీనామా అనంతరం.. ఆమంచి తన భవిష్యత్తు ప్రణాళికను ఈ నెల 9న వెల్లడిస్తానని చెప్పారు. అయితే .. ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1) కాంగ్రెస్‌లో చేరడం. 2) స్వతంత్రంగా పోటీ చేయడం. ఈ రెండు అంశాల్లో ఒక దానిని ఆయన ఎంచుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఆయన స్వతంత్రంగా కంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా చీరాల అసెంబ్లీ స్థానం నుంచే కావడం గమనార్హం.
అసలు ఏం జరిగింది?
ఆమంచి కృష్ణమోహన్ కాపు నాయకుడు. దివంగత రోశయ్యకు అనుచరుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇలా ఆయన ప్రోత్సాహంతోనే 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆమంచి పోటీ చేశారు. అప్పట్లో విజయం కూడా దక్కించుకున్నారు. రోశయ్య శిష్యుడిగా వైఎస్ దగ్గర కూడా మార్కు లు వేయించుకున్నారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి.. 2014లో ఏ పార్టీ తరఫున కాకుండా.. స్వతంత్రంగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
అనంతరం.. చంద్రబాబు సూచనలతో టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఇక, 2019 ఎన్నికల నాటికి.. చంద్ర బాబుతో విభేదించిన ఆమంచి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేశా రు. ఇదేసమయంలో టీడీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకుడు కరణం బలరాం.. ఇక్కడ పోటీ చేసి.. పెద్ద ఎత్తున కనిపించిన వైసీపీ హవాలోనూ.. కరణం గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఆమంచి ఓడిపోయా రు. ఆ తర్వాత.. మరోసారి రాజకీయంగా ఆమంచికి దెబ్బ తగిలింది.
టీడీపీ నుంచి గెలిచిన కరణం.. వైసీపీలోకి వచ్చారు. ఆయన కుమారుడికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక ల్లో చీరాల టికెట్ ఇచ్చింది.. వైసీపీ. అంతేకాదు.. అసలు నియోజకవర్గంతో సంబందం లేని… పరుచూ రుకు ఆమంచిని పంపించింది. దీంతో కొన్నాళ్లు అక్కడే పనిచేసిన ఆమంచి.. ఇక, అక్కడి రాజకీయాలు పొకగక పోవడంతో రెండు నెలల నుంచి చీరాల టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, జగన్ కరుణ లభించలేదు. దీంతో ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.
This post was last modified on April 4, 2024 6:08 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…