కారణం ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో.. అందునా కేసీఆర్ సర్కారు హయాంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా సాగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గడిచిన కొన్ని వారాలుగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు.. మాజీలు అరెస్టు అయ్యారు. అరెస్టుల పరంపర అధికారులకే పరిమితం కాగా.. రాజకీయ అరెస్టులు ఎప్పుడు.. ఏ కోణంలో జరగనున్నాయి? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబీ పార్టీ.. వరుస పరిణామాలపై సరైన రీతిలో స్పందించింది లేదు. తమ మీద పడుతున్న ట్యాపింగ్ మరకలపై మాట్లాడింది లేదు.
మొన్నటికి మొన్న మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎక్కడో ఒకరిద్దరు ఎదవలు ట్యాపింగ్ చేస్తే దానికే ఇంత ఇదైపోవాలా? అంటూ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా మారాయి. ఎందుకంటే కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు సైతం ఇదే తరహా స్పందన. ఒకట్రెండు కుంగితే ఎందుకంత ఆగమాగం? అన్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన వైనం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో ట్యాపింగ్ అంశంపై అలాంటి రియాక్షన్ సరికాదంటున్నారు.
తనలో తెలివి టన్నుల కొద్దీ ఉన్నట్లుగా భావించే కేటీఆర్.. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అయ్యే విషయంలో తడబాటుకు గురి కావటమే కాదు.. అందరిని అడ్డంగా బుక్ చేస్తున్నారన్న మాట పార్టీలో ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ట్యాపింగ్ ఎపిసోడ్ నే చూస్తే.. ఇద్దరు.. ముగ్గురు అధికారులు ఏదో చేస్తే తమకు ట్యాపింగ్ మరక తమకు అంటిస్తారా? అన్న వాదనతో పాటు.. హీరోయిన్లను బెదిరించలేదన్న వ్యాఖ్య.. ట్యాపింగ్ మీద సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై చర్యలు.. లీగల్ నోటీసులు అంటూ ఎడాపెడా మాట్లాడే కేటీఆర్ మాటలకు గులాబీ దళం దండం పెడుతోంది.
అధికారంలో ఉన్న వేళ కేటీఆర్ మాటలు వినసొంపుగా ఉండేవని.. అధికారం చేజారిన తర్వాత ఆయన మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అర్థం కానట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ.. గతాన్ని గుర్తు చేసేలా చేయటంతో పాటు.. మరి అప్పుడు మీరు చేసిందేంది కేటీఆర్? అన్న ప్రశ్నను సంధించేలా ఉన్నాయంటున్నారు. కొంతకాలం కేటీఆర్ మాట్లాడకపోవటమే మంచిదని.. ఆయన నోటికి తాళం వేయాలని గులాబీ నేతలు కోరుకుంటున్నారు. అయితే.. కేటీఆర్ కు ఆ మాట చెప్పే దమ్ము.. ధైర్యం ఎవరికి ఉందన్నది అసలు ప్రశ్న.
This post was last modified on April 4, 2024 3:50 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…