ఏపీలో పింఛన్ల పంపిణీ రాజకీయం కొనసాగుతోంది. 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని వైసీపీప్రభుత్వం చెప్పినా.. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాదపడుతున్న వారు.. పింఛను పంపిణీ కేంద్రాలకు చేరుకు ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వలంటీర్లను నిలిపివేశారంటూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలపై వారు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సినిమా హాళ్ల దగ్గర టికెట్ల పంపిణీకి టీచర్లు, వీఆర్ వోలను నిలబెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వారి సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు.
పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చూపిస్తూ మరీ ఘాటుగా ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయన్నారు. పవన్ తన ట్వీట్‌లో పాత ఉత్తర్వులను జతచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా
అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సాయంగా ఉండాలని జనసైనికలకు పవన్ పిలుపులనిచ్చారు. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని కోరారు. పింఛన్ ఇప్పించిన తరవాత ఇంటి దగ్గర దించి రావాలని పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు.
This post was last modified on April 3, 2024 10:17 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…