Political News

మారిన మనిషి: పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్.!

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండిట్లోనూ ఓటమి చవిచూశారు. కారణమేంటి.? రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో, ఇటు గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటింటి ప్రచారం చేయడానికి వీలు కాలేదు.

కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. టీడీపీ – బీజేపీ.. ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. మొత్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనసేనాని పోటీ చేస్తున్నారు.. అదే పిఠాపురం.

ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి అవకాశం దొరుకుతోంది. జనంతో మమేకమవుతున్నారు. వారి కష్టాల్ని తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యల గురించి అవగాహన కల్పించుకుంటూ, ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతున్నారు.

వాస్తవానికి, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. అయితే, సొంత నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గిపోయింది. పార్టీ నిర్మాణం అప్పటికి సరిగ్గా జరగలేదు. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు సరైన నాయకులూ అప్పట్లో లేరు. ఇప్పటి పరిస్థితి వేరు.

‘పవన్ కళ్యాణ్ రావాల్సిన పనిలేదు.. మేమే గెలిపించుకుంటాం ఆయన్ని.. మేమే ప్రచారం సంగతి చూసుకుంటాం..’ అని జనసైనికులు, పిఠాపురంలో ముందు నుంచీ నినదిస్తున్నారు. టీడీపీ మద్దతు కూడా వుండడంతో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కళ్యాణ్‌కి పూర్తి మద్దిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని గెలిపించే బాధ్యత తనదేనని అంటున్నారు.

వెరసి, పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్‌ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. అన్ని మతాల విశ్వాసాల్ని గౌరవిస్తూ, పవన్ కళ్యాణ్ అందర్నీ కలుపుకుపోతున్న తీరు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకుంటోంది.

This post was last modified on April 2, 2024 11:07 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

21 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

25 minutes ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

30 minutes ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

2 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

2 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

4 hours ago