కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. లేదులేదంటూనే కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ సర్కారుకు గుండెకాయ వంటి వలంటీర్ల వ్యవస్థను ఎన్నికలకు దూరంగా పెట్టింది. వీరిని ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికలకు దూరంగా ఉంచాలని.. ఎలాంటి విధులూ అప్పగించరాదని కూడా పేర్కొంది. దీంతో అత్యంత కీలకమైన సమయంలో వైసీపీకి వలంటీర్లు దూరమయ్యారు.
ఇక, వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్పీప్ చేసిన నెల్లూరు జిల్లా సహా.. గుంటూరు, పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ఎస్పీ లను కూడా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసేసింది. వీరిపై వైసీపీ అనుకూల ముద్ర ఉండడం తెలిసిందే. వారిని తక్షణ మే విధుల నుంచి తొలగించాలని.. ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని విధులు అప్పగించాలని.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదే శించింది. ఇది కూడా ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్ పడనుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక, ఇప్పుడు పెద్ద తలకాయలపైనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్టు సమాచారం. ఏకంగా రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిలను కూడా ఒకటి రెండు రోజుల్లో బదిలీచేసే అవకాశం కనిపిస్తోందని సీనియర్ అధికారుల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. వీరిద్దరిలో డీజీపీ నేరుగా సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు. దీంతో ఆయన ప్రభావం ఎన్నికలపై ఉంటుందని ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశాయి. దీంతో ఆయన మార్పు తథ్యమని అంటున్నారు.
ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపైనా కత్తి వేలాడుతోందని ప్రచారం జరుగుతోంది. ఈయనను కూడా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌కు ఇప్పటికే హైకోర్టు తలంటేసింది. దీంతో ఆయనను తప్పించే అవకాశం ఉంది. ఇక, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిపైనా బదిలీ కత్తి వేలాడుతోందని సమాచారం. మొత్తంగా 5 నుంచి ఆరుగురు కీలక ఐఏఎస్‌ల బదిలీ తథ్యమని అంటున్నారు.
This post was last modified on April 2, 2024 10:59 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…