రాజకీయాల్లో వ్యూహాలు ఉండొచ్చు.. ప్రతి వ్యూహాలు కూడా ఉండొచ్చు. కానీ, రాజకీయాల్లో ఈ రెండింటికీ మించి చేసే పనులు మాత్రం జనాల నుంచి అంత ఆహ్వానం పలికేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. నాయకుల కంటే కూడా.. ప్రజలే చాలా విజ్ఞలు. ఇది ఏపీలో అనేక సందర్భాల్లో రుజువైంది. కనీసం తెలం గాణలో అయినా.. అంతో ఇంతో మార్పు కనిపిస్తుందేమో కానీ.. ఏపీలో అలాంటి ది కనిపించదు. ఇక, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా జరుగుతున్న జంపింగుల విషయం చర్చకు వస్తోంది.
వాస్తవానికి ఇప్పటికే.. అన్ని పార్టీలు టికెట్లు ప్రకటించాయి. కానీ, జనసేనలో మాత్రం ఇంకా ఈ టికెట్ల పందేరం చేయాల్సి ఉంది. అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా.. ఇతర పార్టీల నాయకు లను చేర్చుకుంటున్నారు. ఇది తప్పుకాకపోవచ్చు. కానీ, వారికి టికెట్ కేటాయించడమే ఇప్పుడు అసలు సిసలు సమస్యగా మారింది. తాజాగా అవనిగడ్డ టికెట్ ఖాళీ పెట్టారు. వాస్తవానికి.. దీనిని పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు కేటాయించే అవకాశం ఉంది. కానీ… పవన్ అలా చేయలేదు.
నాన్చి.. నాన్చి.. ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన మండలిబుద్ధ ప్రసాద్‌కు ఇచ్చేస్తున్నారు. ఈ రోజో రేపో దీనిపై ప్రకటన కూడా రానుంది.బుద్ధ ప్రసాద్ మంచి వ్యక్తే కావొచ్చు.. కానీ, పార్టీలో ఇప్పటి వర కు జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు భీమవరం నుంచి అవనిగడ్డ వరకు జరుగుతున్న చర్చ. బలంగా ఉన్న నియోజకవర్గాలను ఇతర పార్టీలకు వదులుకుని.. బలహీనంగా ఉన్న నియోజకవ ర్గాల్లో పొరుగు పార్టీల నేతలను తీసుకుని వారికి టికెట్ ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
అయితే.. దీనిని ఎవరూ ప్రశ్నించరాదని.. తమ అధినేతే ఫైనల్ అని.. నాగబాబు వంటి వారు చెప్పుకోవ చ్చు. కానీ, రేపు సమాధానం చెప్పాల్సింది ప్రజలకు, ఇలానే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ప్రయోగాలు చేశారు. కానీ, ఏమైందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో మాదిరిగా.. జంపింగులకు పట్టం కట్టే పరిస్థితి ఏపీలో పెద్దగా రాలేదు. స్తానికంగా బలంగా ఉండి..నిజమైన కారణంగా పార్టీ మారిన వారికి మాత్రమే ప్రజలు పట్టం కట్టిన సందర్భం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. జనంలో జనసేన టాక్ అయితే.. సన్నగిల్లుతుండడం గమనార్హం.
This post was last modified on April 2, 2024 1:51 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…