Political News

కావ్య‌కు టికెట్ స‌రే.. జనం యాక్సెప్ట్ చేస్తారా?

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ తొలగిపోయింది. రెండు రోజుల కింద‌ట‌ కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనా మా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య  రెండు రోజుల కింద‌ట‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎ స్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా, ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. అనుకు న్నట్లుగానే కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.

ఏఐసీసీ పెద్దలు, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించిన అనంతరం అధిష్టానం సోమవారం రాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే అభ్యర్థుల 9 జాబితాలు విడుదల చేయగా, తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ప్రకటించారు. మహారాష్ట్ర లో అకోలా నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కావ్య విష‌యానికి వ‌స్తే.. పార్టీ మారారు. టికెట్ తెచ్చుకున్నారు. అదేమంటే బీఆర్ ఎస్ గెలిచేది కాదు.. కాబ ట్టి తాము పార్టీ మారుతున్నామ‌ని కావ్య చెప్పారు. మ‌రి ఏమేర‌కు వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ప్ర‌జ‌లు ఈమెను రిసీవ్ చేసుకుంటారు? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. వ‌రంగ‌ల్ హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా జంపింగుల ను ఆద‌రించిన ప‌రిస్తితి లేదు. ఇప్పుడు బీఆర్ ఎస్ ప‌క్షాన కావ్య‌కు టికెట్ కూడా క‌న్ఫ‌ర్మ్ అయింది. దీనిని కూడా కాద‌ని.. తాజాగా కాంగ్రెస్‌లోకి చేరారు.

అయితే.. ప్ర‌జ‌లు ఈ జంపింగుల‌ను స‌హించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. పైగా.. కేవ‌లం ప‌దవులు ఆశించి.. ప‌ద‌వుల కోసం చేసే రాజ‌కీయాల‌ను వ‌రంగ‌ల్ ప్ర‌జలు ఇప్ప‌టి వ‌రకు ఆద‌రించారా? అనే ప్ర‌శ్నే మిగులు తోంది. ఈ నేప‌థ్యంలో కావ్య గెలుపు అంత ఈజీ కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. ఎస్సీ వ‌ర్గాల్లోనూ ఈ కుటుంబం ప‌రువు పోగొట్టుకుంటోంద‌ని అంటున్నారు. దీని నుంచి వ్య‌క్తిగ‌తంగా క‌డియం ఫ్యామిలీ మ‌రింత కోల్పోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. 

This post was last modified on April 2, 2024 10:36 am

Share
Show comments
Published by
Satya
Tags: Kavya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

5 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

15 hours ago