పార్టీ ఏదైనా.. కొన్ని నియోజకవర్గాలు చాలా చాలా టఫ్‌గా మారిపోయాయి. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేతలే.. తమను తాము అభ్యర్థులుగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ పొందిన వారికంటే. కూడా పార్టీల అధినేతలే ఎక్కువగా మధన పడుతున్నారు. ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడ అభ్యర్థుల పేర్లు టెక్నికల్ అయినా.. నిజమైన పోటీ పార్టీ అధినేతల మధ్యే ఉందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
ఏ ఎన్నికలైనా.. అభ్యర్థులకు కత్తిమీద సామే. అభివృద్ది చేశామని, అభివృద్ధి చేస్తామని చెబుతున్నపార్టీ ఒకవైపు. ఇప్పటి వరకు వేల కోట్లు సంక్షేమం రూపంలో అందించామని చెబుతున్న పార్టీ మరోవైపు. ఈ రెండు పార్టీల మధ్యే పోరు ఘోరంగా సాగనుంది. దీంతో అభ్యర్థులు చమటోడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. ఇది 175 నియోజకవర్గాల్లోనూ కాదు. ఎందుకంటే.. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా. కొన్ని కొన్ని నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల గెలుపును అధినేతలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదాహరణకు.. పుంగనూరు, మంగళగిరి, కడప, పులివెందుల, టెక్కలి, పిఠాపురం, హిందూపురం, విజయవాడ వెస్ట్, చిలకలూరిపేట, పెద్దకూరపాడు, నరసరావుపేట, మచిలీపట్నం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, పలాస, తాడికొండ, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కుప్పం, ఆత్మకూరు, వెంకటగిరి, విశాఖ ఎంపీ, నరసాపురం ఎంపీ, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఇలా చాలా నియోజకవర్గాలు ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి.
ఇక్కడ వైసీపీ గెలిచి తీరాలని.. టీడీపీకి చుక్కలు చూపించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో ఆయనే స్వయంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ షెడ్యూల్ ప్రకారం.. ఒక రోజు కాకుండా.. మూడు రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇక, టీడీపీ వైపు కూడా ఇంతే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తా నిలబెట్టుకోవాలని ఆయన కూడా చూస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఆయా నియోజకవర్గాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.
దీంతో స్వయంగా బాబు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించి.. ప్రచారం చేయనున్నారు. దీంతో ఇక్కడి అభ్యర్థులు చేసుకునే ప్రచారం కన్నా.. అధినేత ప్రచారానికే ఎక్కువగా ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో వారు ఎలా ప్రచారం చేసుకున్నా.. అధినేతలే సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో తమకు దిగుల్లేదనే వాదన వినిపిస్తోంది. అయినా.. అభ్యర్థులు సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అధినేతల సహకారం మరింత తోడు కానుంది. దీంతో ఈ నియోజకవర్గాలే చాలా టఫ్‌గా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 1, 2024 2:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…