రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు.. శాశ్వత మిత్రులు కూడా లేరు. అవకాశం-అవసరం
ఈ రెండు చాలు. నాయకులు, పార్టీలు కూడా.. సర్దుకు పోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లోనూ ఇదే జరుగుతోంది. రెండు నెలల కిందట మాజీ మంత్రి , అగ్రనేత కేటీఆర్‌ను తిట్టిపోసిన నాయకుడికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు.
ఎస్సీలకు విలువ లేదు. కేటీఆర్ మాయలోడు. కనీసం నాకు విలువ ఇవ్వకుండా దూషించాడు. అనేక అవమానాలు చేశాడు. అందుకే పార్టీలో ఉండలేక పోతున్నా. రాజీనామా చేస్తున్నా
అంటూ రెండు మాసాల కిందట సంచలన వ్యాఖ్యలు చేసి.. బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది. వచ్చేయ్ ఆ మాటలు మేం పట్టించుకోం
అంటూ.. బీఆర్ఎస్ నుంచి రాజయ్యకు ఆహ్వానం అందింది. దీంతో రాజయ్య కూడా.. బీఆర్ఎస్ కండువా కప్పుకొనేందుకు రెడీ అయిపోయారు.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు రాజయ్యకు రాజకీయ శత్రువు, సొంత నియోజకవర్గం నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్య నేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవడంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్లు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
వరంగల్ పార్లమెంటు టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తప్ప తాటికొండ రాజయ్యను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు దీంతో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తుంది. ఈ వ్యూహం వెనుక.. తాము టికెట్ ఇచ్చి, గెలిపించుకున్న కడియం కుటుంబం తమకు ద్రోహం చేసిందని.. ఆయనకు చెక్ పెట్టాలన్నదే బీఆర్ ఎస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 1, 2024 6:59 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…