Political News

మూకుమ్మ‌డి రాజీనామాలు పెద్ద డ్రామా: ష‌ర్మిల

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌త్యేక మోదా కోసం.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మూకుమ్మ‌డి రాజీనామాలు చేయాల‌న్న జ‌గ‌న్ పిలుపు పెద్ద‌డ్రామా” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువ‌చ్చే విషయంలో జ‌గ‌న్‌.. నాటకాలాడారని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ష‌ర్మిల పేర్కొన్నారు. దీనిపైనే రాహుల్ గాంధీ ఫ‌స్ట్ సంత‌కం చేస్తార‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ష‌ర్మిల విమర్శించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీకి తెర‌చాటున అమ్ముడు పోయార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని షర్మిల దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పెద్దలతో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై సోమ‌వారం స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ష‌ర్మిల చెప్పారు. ఆ రోజే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా, ఏపీలో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు సంబంధించిన జాబితా సిద్ధమయినట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1,500 దరఖాస్తులు వచ్చినట్టు షర్మిల వెల్లడించారు. అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించి తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అయితే.. టికెట్ వ‌చ్చినా.. రాకున్నా.. పార్టీకోసం ప‌నిచేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. పార్టీని నిల‌బెట్టుకుంటే.. త‌ర్వాత ప‌ద‌వులు అవే వ‌స్తాయ‌న్నారు.

This post was last modified on March 30, 2024 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

6 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

16 hours ago