అయిపోయింది.. అంతా అయిపోయింది.! ఔను, ‘తెలంగాణ జాతి పిత’ అన్న ట్యాగ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందర ఇకపై వుండకపోవచ్చు.! తెలంగాణ రాజకీయ తెరపైనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో కనుమరుగైపోయింది. ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి. ఎప్పుడైతే, పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ని తొలగించేశారో, అప్పుడే ఖేల్ ఖతం అయిపోయింది.!
ఒకరొకరుగా భారత్ రాష్ట్ర సమితిని వీడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులూ పార్టీని వీడుతుండడం గమనార్హం. అసలంటూ భారత్ రాష్ట్ర సమితిలో మెజార్టీ ‘వలస నేతలే’. ఎలా వలస వచ్చారో, అలా వలస వెళ్ళిపోతున్నారు. దాంతో, భారత్ రాష్ట్ర సమితి, శరవేగంగా ఖాళీ అయిపోతోంది.
కేశవరావు, కడియం శ్రీహరి.. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాంతాడంత. చివరికి భారత్ రాష్ట్ర సమితిలో ఎవరు మిగులుతారు.? హరీష్ రావు వుంటారా.? ఆయనా పార్టీ మారతారా.? ఇలా చాలా అనుమానాలు. అసలంటూ తొలి వికెట్టే హరీష్ రావుది అయి వుండాలన్న ప్రచారం గతంలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీలోకీ, భారతీయ జనతా పార్టీలోకీ.. బీఆర్ఎస్ నేతలు వలస వెళుతున్నారు. ‘వెళుతున్నవారిని ఆపబోం.. అలాంటివారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి రానివ్వం..’ అని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, ఇదే బీఆర్ఎస్.. గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. కేసీయార్ ఎలాగైతే వలసల్ని ప్రోత్సహించారో, ఇప్పుడు అధికారంలో వున్న రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు.
నువ్వు చేసింది తప్పు.. అని కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి వీల్లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే బీఆర్ఎస్ ఇంతలా ఖాళీ అయిపోయిందంటే, లోక్ సభ ఎన్నికల తర్వాత అసలంటూ బీఆర్ఎస్ పార్టీ వుంటుందా.? వుండదా.?
ఇంతకీ, కేసీయార్ రాజకీయ పయనమెటు.? విలీనం దిశగా కేసీయార్ అడుగులేస్తారా.? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మిస్తారా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో పునర్నిర్మాణం దాదాపు అసాధ్యం.. కేసీయార్‌కి విలీనమే శరణం.!
This post was last modified on March 30, 2024 8:47 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…