దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుని.. అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్.. ఆత్మరక్షణలో పడిపోయింది. కీలకమైన ఎన్నికల వేళ.. ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకవైపు నేతలు పోతున్నారు. మరో వైపు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. తాజాగా ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసింది.
నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్తంభించిన బ్యాంకు ఖాతాల వల్ల నగదు కొరత ఏర్పడింది. మరోవైపు తాజా నోటీసులతో కాంగ్రెస్ ఇరకాటంలో పడ్డట్లైంది. దెబ్బ మీద దెబ్బ పడటంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే ఐటీ నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ లాయర్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా ఆరోపించారు.
ఇది అప్రజాస్వామిక చర్య అని, అసమంజసమైనదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ఇదంతా చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామ న్నారు. కాగా, 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌లో కాంగ్రెస్ పార్టీ 2014-15 నుంచి 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను నిలిపివేయాలని కోరుతూ సవాలు చేసింది.
ఈ పిటిషన్ల విచారణ సమయంలో ఈ మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్లు మదింపు నుంచి తప్పించుకున్నట్లు పన్ను శాఖ వాదించింది. ఐటీ శాఖ ఖచ్చితమైన సాక్ష్యాలను సమర్పించినందున న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను కొట్టేసింది. 2014-15 నుంచి 2016-17 వరకు ఐటీ పన్నులకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు తాజా పిటిషన్‌కు కూడా వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇక 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను బకాయిలు, వడ్డీలకు సంబంధించి కాంగ్రెస్ ఢిల్లీ బ్యాంక్ ఖాతాల నుంచి ఇప్పటికే రూ.135 కోట్లను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆర్థికంగా దిగ్బంధనంలో చిక్కుకు పోయింది.
This post was last modified on March 29, 2024 10:55 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…