టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నా న్ని వైసీపీ రాజధానిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటోందో ఆమె వివరించారు. “ఇటీవల విశాఖ పట్నా నికి.. 25 వేల కిలోల డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ వచ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వచ్చిందని అంటున్నారు. విశాఖలో తీర ప్రాంతం ఉండడం.. బలమైన పోర్టు ఉండడంతో ఇక్కడ నుంచి ఇలాంటి గంజాయి.. డ్రగ్స్‌ను రవాణా చేసుకునేందుకు సులభంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్కడ రాజధాని కావాలని అంటోంది” అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తప్పుడు పనులు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి తెలివి ఎక్కువగా ఉందని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్టలు, జేబులు నింపుకొంటారని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని గంజాయి కేపిటల్ గా తీర్చిదిద్దుతున్నారని ఆమె దుయ్యబట్టారు. తాజాగా నిజం గెలవాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వరి.. నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించరు.
ఈ సందర్భంగా భవనేశ్వరి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మహిళలు కనిపించకుండా పోయారని .. ఇప్పటికీ వారు ఎక్కడున్నారో తెలియడం లేదని, కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న భద్రత అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, కల్తీమద్యంతో నింపేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గంజాయి కారణంగా అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. అనేక మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు. ఐదేళ్లలో ఏమైనా పరిశ్రమ వచ్చిందా? ఒక్క మంచి పని అయిన వైసీపీ నేతలు చేశారా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. దీనిపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు.
This post was last modified on March 28, 2024 11:45 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…