Political News

ఆ కంటైనర్ లో ఏముంది జగన్?

ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళగిరి పోలీసులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసులోకి భారీ కంటైనర్ వెళ్ళినా తనిఖీలు చేయకపోవడంపై లోకేష్ స్పందించారు. అంతేకాకుండా, ఆ కంటైనర్ రాంగ్ రూట్లో వెళ్లినా భద్రతా సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎందుకు వచ్చింది? ఏం తెచ్చింది? అని లోకేష్ ప్రశ్నించారు.

ఈ కంటైనర్ రాకలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన పోలీసులకు కనిపించడం లేదా అని లోకేష్ నిలదీశారు. ఆ కంటైనర్ లో బ్రెజిల్ సరుకు ఉందా లేక లిక్కర్ అమ్మి సంపాదించిన వేల కోట్ల డబ్బు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. లేదంటే జగన్ లండన్ పారిపోయేందుకు ఏర్పాటు జరుగుతున్నాయా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నలకు ఏపీ డీజీపీ సమాధానం చెబుతారా అనే లోకేష్ ప్రశ్నించారు.

మరోవైపు, రేణిగుంటలో వైసీపీ నేతకు చెందిన గోడౌన్ లో ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలు వంటి 52 రకాల వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై కూడా లోకేష్ స్పందించారు. జగన్ ను ప్రజల శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయించుకున్నారని, అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్ తో, తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వస్తువుల డంప్ ను అధికారులు టీడీపీ నేతల ఫిర్యాదుతో పట్టుకున్నారని, ఇసుక, లిక్కర్ వ్యాపారంలో జగన్ దోచుకున్న కోట్ల రూపాయల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. జగన్ పై ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా వారి ఆగ్రహ జ్వాల చల్లారదని, ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేష్ అన్నారు.

This post was last modified on March 27, 2024 4:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

5 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

15 hours ago