Political News

సీఎంగా నా ఫ‌స్ట్ సంత‌కం ఆ ఫైల్ పైనే..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాను నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే తొలి సంత‌కం దేనిపై పెడ‌తానో అనే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. తాను సీఎంగా నాలుగోసారి ప్ర‌మాణం స్వీకారం చేసిన వెంట‌నే  మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేస్తాన‌న్నారు. “మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా. ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చాక తొలి రోజే తొలి సంత‌కం డీఎస్సీపై చేస్తా.  అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుంది” అని అన్నారు. రాష్ట్రం లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

“మీరు (యువత) వెళ్లి  ఎన్నికల సంఘాన్ని కలవండి. ఇప్పుడు డీఎస్సీ వద్దు అని చెప్పండి. ఎన్నికలు అయ్యాకే డీఎస్సీ జరపాలని కోరండి. మేం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీ గురించి మాట్లాడతాం” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. గ‌తంలో టీడీపీ 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు అదే రికార్డ్ అని, మళ్లీ అలాంటి రికార్డునే సృష్టిస్తామని చెప్పారు. తాము మెగా డీఎస్సీనే జరుపుతామని, గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో డీఎస్సీ నిర్వహిస్తామని  ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. మీ జీవితాలను అంధకారం చేసిన జలగ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. “యువ‌త‌ను నాశ‌నం చేశాడు. గంజాయి, మ‌ద్యానికి, క‌డాన డ్ర‌గ్స్‌కు కూడా యువ‌త‌ను బానిస‌ల‌ను చేసిన ఏకైక ముఖ్య‌మంత్రి ఈ జ‌గ‌న్‌. ఈయ‌న జ‌గ‌న్ కాదు.. యువ‌త ర‌క్తం పీల్చే జ‌ల‌గ‌. ఈయ‌న‌ను ఇంటికి పంపించేందుకు యువ‌త అంతా ఏకం కావాలి. వారి త‌ర‌ఫున పోరాడేందుకు నేనున్నారు. నేను అధికారం చేప‌ట్టిన వెంట‌నే తొలి సంత‌కం డీఎస్సీపైనే చేస్తాన‌ని మీకు హామీ ఇస్తున్నా“ అని చంద్ర‌బాబు యువ‌త‌కు తెలిపారు. కుప్పంలో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on March 27, 2024 12:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago