బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్ కుటుంబం పరిస్థితి దారుణంగా మారిందా? పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత నేతలు లేని పరిస్థితి, పోటీలో నిలపలేని పరిస్థితి సైతం వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడు పార్లమెంటుఎన్నికలు జరిగినా.. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరో ఒకరైనా పోటీ చేస్తున్నారు.
కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఇలా జరగడం బీఆర్ ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. 2000-21 సంవత్సరంలో(23 ఏళ్ల కిందట) కేసీఆర్ చెప్పినట్టుగా గుప్పెడు మంది నాయ కులతోనే టీఆర్ ఎస్(ప్రస్తుతం బీఆర్ ఎస్) పార్టీ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్‌కు తీసుకువె ళ్లింది. పాదం పాదం కదిపేలా… పల్లెపల్లెను జాగృత స్థితిలోకి తీసుకు వచ్చింది. ఇలా.. ప్రారంభమైన టీఆర్ ఎస్ .. అనతి కాలంలోనే ప్రజల హృదయాలను చూరగొంది.
అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి వారు కల్వకుంట్ల కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలుస్తూ.. తమ హవాను ప్రదర్శించారు. వరుస విజయాలు కూడా కేసీఆర్ అందుకున్నారు. అప్రతిహత విజయ నినాదంతో ఆయన ముందుకు సాగారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టి యూపీఏ హయాంలో కేంద్రంలోనూ పదవులు దక్కించుకున్నారు.
అయితే, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కవిత విషయానికి వస్తే.. గత 2014లో నిజామాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2019లో ఓడిపోయారు.
ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. పోటీ చేయాలనే అనుకున్నారు. కానీ, మద్యం కేసుల కారణంగా కేసీఆర్ ఆమెకు టికెట్‌ను నిరాకరించినట్టు పార్టీ వర్గాలు అప్పట్లోనే చెప్పాయి. మొత్తంగా చూస్తే.. ఒకవైపు పోయే నాయకులు.. మరోవైపు కుటుంబ చిక్కులు.. ప్రత్యర్థుల నుంచి పోటీ వంటివి కేసీఆర్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబం పోటీలో లేకుండా పోవడం మరి చిత్రమైన విషయం.
This post was last modified on March 26, 2024 12:14 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…