Political News

బీజేపీ అభ్య‌ర్థులు గెలుపు గుర్రాలేనా?

బీజేపీ అధిష్టానం తాజాగా.. ఆరు పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. వీరిలో ఒక్క న‌రసాపురం పార్ల‌మెంటు స్థానం టికెట్‌ను ద‌క్కించుకున్న భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ త‌ప్ప‌.. మిగిలిన వారంతా.. ఏడాది, లేదా రెండేళ్ల కింద‌ట‌(ఒక్క పురందేశ్వ‌రి మిన‌హా. ఈమె 2019 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు) పార్టీలోకి వ‌చ్చిన వారే. అయిన‌ప్ప‌టికీ.. వీరికి పార్టీ కీల‌క‌మైన ఎంపీ స్థానాల‌ను క‌ట్ట‌బెట్టింది. వీరిలో వివాద‌స్ప‌ద నాయ‌కురాలుగా పేరున్న కొత్త‌ప‌ల్లి గీతకు ఏకంగా అర‌కు స్థానం ఇచ్చారు.

ఇక‌, తెలంగాణ‌లో ఉంటూ.. ఏపీలో టికెట్ సంపాయించుకున్నారు మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి. ఈయ‌న రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక‌, టీడీపీ నుంచి 2020లో బీజేపీలో చేరిన సీఎం ర‌మేష్‌కు అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానం ఇచ్చారు. ఈయ‌న ఇక్క‌డ నాన్‌లోక‌ల్‌.అయితే.. వెల‌మ నాయుళ్ల కులం కావడం.. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంల‌లో ఈ క‌మ్యూనిటీ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ సీటును ఆయ‌న‌కు కేటాయించార‌నే చర్చ సాగుతోంది.

ఇక‌, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం మ‌రీ క్యామెడీ అయిపోయింద‌ని బీజేపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నటి వ‌ర‌కు వైసీపీలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌ను తీసుకువ‌చ్చి.. తిరుప‌తి సీటు ఇచ్చారు. కానీ, ఈయ‌నకు బీజేపీ నేత‌ల‌తో ఎక్క‌డా ట‌చ్ లేదు. క‌నీసం మాటలు కూడా లేవు. అయినా.. వ‌ర‌ప్ర‌సాద్‌కు ఇచ్చారు. దీంతో వీరి గెలుపు ఎలా? అనేది పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. వీరంతా బ‌ల‌మైన సంప‌న్నులే అయినా.. సొమ్ములు ఖ‌ర్చు పెట్టేందుకు పెద్ద‌గా ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

దీంతో బీజేపీ టికెట్లు ఇచ్చినా.. క్షేత్ర‌స్థాయిలో వీరితో క‌లిసి న‌డిచే నాయ‌కులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అర‌కులో కొత్త‌ప‌ల్లిగీత‌ను ఎస్టీ సామాజిక వ‌ర్గం నాయ‌కులు ఎప్పుడో దూరం పెట్టారు. ఈమె చంచెల స్వ‌భావ‌మే ఈమెను ప్ర‌జ‌ల‌కు దూరం చేసింది. వైసీపీలో గెలిచిన త‌ర్వాత‌.. 2014లో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు క‌నీసం మొహం కూడా చూపించ‌కుండా టీడీపీకి జై కొట్టింది. త‌ర్వాత‌. సొంత పార్టీ పెట్టుకుంది. ఆ త‌ర్వాత‌.. దీనిని బీజేపీలో విలీనం చేసింది. ప్ర‌జ‌లు ఆమెకు మ‌ద్ద‌తివ్వ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలా.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌.. గెలుపు గుర్రాలు ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on March 25, 2024 5:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

56 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago