తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. ఉద్యమంతో ప్రారంభమైన ఆయన ప్రస్తా నం.. అంతకు ముందు టీడీపీలో ఉన్నా.. మంత్రి పదవి, స్పీకర్ పదవులు చేసినా రాలేదు. అంతేకాదు.. కేసీఆర్ తన స్వశక్తితోనే ఎదిగారు. స్వశక్తితోనే పార్టీని నిలబెట్టారు. అందుకే బీఆర్ఎస్ అంటే.. కేసీఆర్ చేత ఏర్పడిన పార్టీ.. కేసీఆర్ చేత నిలదొక్కుకున్న పార్టీ.. కేసీఆర్ చేత అధికారంలోకి వచ్చిన పార్టీగా గుర్తింపు పొందింది. పదేళ్లు నిరాఘాటంగా తెలంగాణను ఏలిన పార్టీ కూడా బీఆర్ ఎస్ కావడం గమనార్హం. ఒకానొక దశలో తనకు తెలంగాణలో ఎదురులేదని ఇక దేశంలో అగ్గిపెట్టడమే మిగిలిందని ఆయన అనుకున్నారు. కానీ ఒకే ఒక్క ఎన్నికతో మొత్తం రివర్స్ అయింది.
ఒకప్పడు ఓవర్ లోడ్ తో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అయిపోతోంది. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లినప్పటి నుండి ఆయన ఎత్తుపల్లాలు చూసి ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. నమ్మి నెత్తికెక్కించుకున్న వారంతా నట్టేట ముంచేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో ఉన్న ప్రొఫెసర్ లు, ఇతర మేధావులను కేసీఆర్ దూరం చేసుకున్నారు. ఉద్యమ నాయకులను ఏనాడూ ఆయన పట్టించుకోలేదు. కేవలం రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నవారినే అందలం ఎక్కించారు.
ఫలితంగా.. పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా.. ఇప్పుడు కేసీఆర్‌కు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు కష్ట కాలంలో(కుమార్తె అరెస్టు, కేసులు) కనీసం పన్నెత్తి పలకరించడం కూడా లేదు. ఖండించడమూ లేదు. అంటే.. ఒకరకంగా.. ఇది ‘కేసీఆర్ వలన'(ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేసిన పనులు.. కరడుగట్టిన తెలంగాణ వాదాన్ని వినిపించిన వారికి దూరం కావడం) సాగుతున్న జారుడు బండపై జోగాట(జారుడు బల్లల ఆట)గా మారిపోయింది. ఫలితంగా బీఆర్ ఎస్ ఇక, కేసీఆర్‌తో సరి! అనే మాట వినిపించినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఎక్కడ నుంచి ఎక్కడి వరకు?
కేసీఆర్‌కు కానీ, బీఆర్ ఎస్ కు కానీ.. కల్వకుంట్ల కుటుంబం మినహా.. ఇప్పుడు ఎవరు నమ్మకమైన నేత అంటే ఆ పార్టీ అగ్రనేతలు ఫలానా అని చెప్పుకోలేని దారుణ పరిస్థితి తెరమీదికి వచ్చింది. ఒక్కరంటే ఒక్కరినీ నమ్మలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తూంటే ఒక్కరూ రాలేదు. ఆందో్ళనల కు పిలుపునిస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో.. వేరే పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి.
నమ్మకమైన నేస్తమే..
కె. కేశవరావు. ఈయన గత ఎనిమిది సంవత్సరాలకు పైగా కేసీఆర్‌కు అత్యంత నమ్మిన బంటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసిన కేశవరావు.. తెలంగాణ ఉద్యమ కాలంలో దూరంగా ఉన్నారు. కానీ, తర్వాత కేసీఆర్‌కు చేరువయ్యారు. అలాంటి నమ్మకమైన నేస్తమే.. ఇప్పుడు కేసీఆర్‌కు హ్యాండిస్తున్నారు. తన పాతగూడు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని ఇంటికి ఆహ్వానించేవారు కాదు. అసలు కేకే ఎవరు ?. రాజకీయంగా ఆయన పలుకుబడి ఎంత ?. అని ఆలోచిస్తే… ఆయన వెంట పది మంది ఓటర్లు ఉంటారని ఎవరూ అనుకోరు.
కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే అదీ లేదు. అయినా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మికి అడగ్గానే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ, ఇప్పుడు నమ్మకం కూడా రాజకీయంగా మారిపోయింది. సో.. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ చేత ఏర్పడిన బీఆర్ ఎస్.. కేసీఆర్ చేత నిలదొక్కుకున్న బీఆర్ ఎస్.. ఇప్పుడు కేసీఆర్ వలన జారుబండపై చేరిపోయింది. మరి కేసీఆర్‌తోనే అయిపోతుందా? నిలబడుతుందా? అనేది చూడాలి.
This post was last modified on March 25, 2024 7:36 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…