జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారి జాబితాను విడుదల చేశారు. వీరిలో ఇద్దరు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. పార్టీ తీర్థం పుచ్చుకున్నవారు ఉండడంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిలో ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ కావడం గమనార్హం. వైసీపీలో చిత్తూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (బలిజ)కు వేరే నియోజకవర్గం ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసింది. అయితే.. ఆయన దానిని కాదన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు సూచనలతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కు తిరుపతి అసెంబ్లీ నియోజకర్గం ఖరారు చేశారు. అయితే..ఇక్కడ ఆయనకు సొంత పార్టీ(జనసేన) నేతల నుంచే తిరుగుబాట్లు జరుగుతున్నాయి.
ఇక, టీడీపీ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. ఆ పార్టీ నుంచి భీమవరం టికెట్ ఆశించిన పులపర్తి రామాంజనేయులుకు.. చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. పైగా.. ఈ స్థానాన్ని జనసేనకు మిత్రపక్షంలో భాగంగా కేటాయించారు. ఈ క్రమంలో పులపర్తి.. జనసేనలోకి చేరిపోయారు. తాజాగా ఇచ్చిన జాబితాలో ఆయనకు భీమవరం టికెట్‌ను ఖరారుచేశారు. దీనిని టీడీపీ నాయకులు ఎలా ఉన్నా.. జనసేన నాయకులు మాత్రం మండిపడుతున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. అయినప్పటికీ.. పవన్ మాత్రం ఈ ఇద్దరికీ టికెట్లు ఇవ్వడం గమనార్హం.
మొత్తం 18 మందితో జాబితా ఇదీ..
పిఠాపురం-పవన్ కల్యాణ్, నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి-కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, రాజీనగరం-బత్తుల బలరామకృష్ణ, తెనాలి- నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేష్‌బాబు, యలమంచిలి-సుందరపు విజయకుమార్, పి. గన్నవరం-గిడ్డి సత్యనారాయణ, రాజోలు – దేవ వరప్రసాద్, తాడేపల్లి గూడెం-బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం-పులపర్తి రామాంజనేయులు, నరసాపురం – బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు, పోలవరం -చిర్రి బాలరాజు, తిరుపతి – ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు- యనమల భాస్కరరావు. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on March 25, 2024 7:29 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…