ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు-పోలింగ్‌కు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. దీంతో నాయ కులు ఎక్కడికక్కడ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్రచారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయని అనుకుంటు న్నారో.. లేక.. ఇప్పటి నుంచి అన్నిరోజులు ఎండలో తిరగలేమని బావిస్తున్నారో.. తెలియదు కానీ.. అన్ని పార్టీల నాయకులు, టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే.. ఈ సమ యాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై వారిని దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. గెలుపు కోసం అనేక వ్యూహాలను రచిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టీడీపీ విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు టీడీపీ అధినేత చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు… వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
This post was last modified on March 23, 2024 1:29 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…