ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై రాజకీయాలకు అతీతంగా పలువురు స్పందిస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్ గురువు అన్నాహజారే కూడా ఉన్నారు. ఆయన భిన్నమైన వాదన వినిపించారు. అయితే.. రాజకీయ దురంధరు డిగా పేరొందిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తొలిసారి స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టును ఆయన ఖండించారు. దీనిని అప్రజాస్వామిక మని అన్నారు. అంతేకాదు.. కేజ్రీవాల్ అరెస్టు.. భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో చాలా మంది అమాయకులు ఇరుక్కుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పని చేస్తోందని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. కొన్నాళ్ల కిందట జార్ఖండ్ సీఎం(ప్రస్తుతం మాజీ) హేమంత్ సోరెన్, ఇటీవల తన కుమార్తె కవిత, ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌లు ఇందుకు నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నబీజేపీ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అని పేర్కొన్నారు. ఈ అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
గురువు డిఫరెంట్
కేజ్రీవాల్‌కు గురువుగా పేర్కొనే అన్నా హజారే ఆయన అరెస్టుపై భిన్నంగా రియాక్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీలకు దూరంగా ఉండాలని.. ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని తాను ఎన్నాళ్లుగానో మొత్తు కుంటున్నట్టు హజారే పేర్కొన్నారు. కానీ, మరింతగా డబ్బు కూడగట్టాలనే ఏకైక ఉద్దేశంతోనే కేజ్రీ ఈ పనిచేశారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఈ వ్యాఖ్యలను కమల నాథులు క్షణాలలోనే దేశవ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు.
‘‘ కేజ్రీవాల్ గతంలో నాతో కలిసి పని చేశారు. లిక్కర్‌కి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. అలాంటిది ఇవాళ మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది. కానీ, ఇప్పుడేం చేయగలం. చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురుచెప్పలేం’’ అని హజారే పేర్కొన్నారు. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ పోరాటం నుంచే ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత.. హాజారే.. కేజ్రీవాల్‌తో విభేదించారు. రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తప్పుబట్టారు.
This post was last modified on March 23, 2024 12:32 am
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…