టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులపై పట్టు బిగించారు. అనేక పర్యాయాలు సర్వేలు.. సంప్రదింపులు జరిపిన చంద్రబాబు పలు కీలక నియోజకవర్గాలకు పెను మార్పులు చేయకుండానే టికెట్లు ఇచ్చేశారు. దీనిలో భాగంగా కొన్నాళ్లుగా తీవ్ర ఉత్కంఠగా ఉన్న పెనమలూరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ నాయకుడు బోడే ప్రసాద్‌కే చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో పెను వివాదానికి తెరదించినట్టయింది.
ఇక, ప్రస్తుతం పెండింగులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా, మరో ఐదు శాసనసభ, నాలుగు ఏంపీ స్థానాలను పెండింగులో పెట్టింది.
11 మంది అసెంబ్లీ అభ్యర్థులు వీరే
పలాస – గౌతు శిరీష
పాతపట్నం – మామిడి గోవింద్ రావు
శ్రీకాకుళం – గొండు శంకర్
శృంగవరపు కోట – కోళ్ల లలితా కుమారి
కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు
అమలాపురం – అయితాబత్తుల ఆనంద రావు
పెనమలూరు (ఎస్సీ) – బోడె ప్రసాద్
మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్లమెంట్ అభ్యర్థుల జాబితా
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మెతుకుమిల్లి భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్ట మహేష్ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాధ్ (చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల – టీ. కృష్ణ ప్రసాద్
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
కర్నూలు – బస్తిపాటి నాగరాజు
నంద్యాల – బైరెడ్డి శబరి
హిందూపూర్ – బీకే పార్థసారధి
This post was last modified on March 22, 2024 2:17 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…