టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వెంట నడిచిన నాయకులకు న్యాయం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యా త్ర ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక, ఈ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇలానే అనేక మంది యాత్రకు సహకరించారు. ఆర్థిక సాయం చేయడంతోపాటు.. జనాలను తరలించ డం వరకు కూడా.. అనేక రూపాల్లో సాయం చేశారు.
ఇలాంటి వారిలో కొందరు.. నారా లోకేష్ మనసు చూరగొన్నారు. యువగళానికి సంబంధించి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగడం దగ్గర నుంచి కార్యకర్తలను మొబిలైజ్ చేయడం.. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు అవస రం వంటి అనేక విషయాలను వారు చూసుకున్నారు. ఇలాంటి వారికి నారా లోకేష్ చాలా చేరువయ్యారు. ఈ క్రమంలో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తమ మనసులో కోరికను వెల్లడించారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నన్నారు.
అయితే, వీరిలో ముగ్గురు నుంచి నలుగురి వరకు టికెట్లు ఇప్పించేందుకు నారా లోకేష్ ఎంతో కృషి చేశారు. వీరిలో ఇప్పటికే టికెట్ సొంతం చేసుకున్న భాష్య ప్రవీణ్ కూడా ఒకరు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపా రి, భాష్యం విద్యాసంస్థల్లో ఒక భాగస్వామి. అదేవిధంగా.. ప్రస్తుతం పెనమలూరు టికెట్ రేసులో ఉన్న దేవినేని చంద్రశేఖర్ కూడా నారా లోకేష్‌కు అత్యంత ప్రియమైన నాయకుడు. ఇక, సీనియర్ నేత కుమా రుడు, యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ రావడం వెనుక కూడా నారా లోకేష్ ఉన్నారు.
వాస్తవానికి ఎన్డీయే పక్షాల పొత్తులో భాగంగా.. శ్రీకాళహస్తి టికెట్‌ను బీజేపీ కోరుకుంది. దీంతో బీజేపీకి ఇచ్చేందుకు కూడా పార్టీలో చర్చలు జరిగాయి. అయితే.. నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా సుధీర్‌కు ఇచ్చిన హామీ మేరకు టికెట్ దక్కడం విశేషం. ఇక, కొందరికి పార్టీలోనూ పదవులు ఇప్పించారు. టికెట్ ఇవ్వలేని వారికి ఈ అవకాశం కల్పించారు. మొత్తంగా చూస్తే.. నారా లోకేష్ బృందానికి మేలు జరిగిందనేది టీడీపీ నేతల మాట.
This post was last modified on March 23, 2024 4:40 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…