నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ పోరు పడలేకే ఆ డైలాగు చెప్పానని, తనకు లేకపోయినా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించానని చెప్పడం వీడియో రూపంలో తిరిగింది.
నిజానికి గాజు గ్లాసు గురించి పంచులు గట్టిగానే ఉన్నాయి కానీ వాటిని నేరుగా ప్రతిపక్ష పార్టీలు తమకు తాము అన్వయించుకుంటే ఎలాని అభిమానుల ప్రశ్న. సినిమాలో ఒక పాత్ర విసిరిన సవాల్ కు బదులుగా పోలీస్ దుస్తుల్లో ఉన్న భగత్ సింగ్ చెప్పే సమాధానం తప్పించి దానికి ఇంకే అర్థం లేదని అంటున్నారు. వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా ఎన్నికల వాతావరణంలో ప్రతి చిన్న అంశం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అందులోనూ జనసేన తరఫున యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో టీజర్ వచ్చి వివాదం తెచ్చింది.
ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్దుమణిగినా లేక నోటీసులు గట్రా వచ్చి వీడియో తీసేయడం దాకా వెళ్లినా దాని వల్ల వచ్చే పబ్లిసిటీ ఉస్తాద్ భగత్ సింగ్ కు మరింత ఉపయోగపడుతుందనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇంకా పాతిక శాతం కూడా షూటింగ్ పూర్తి కాకుండానే రెండు టీజర్లు కట్ చేయించిన హరీష్ శంకర్ ప్రస్తుతం తాను చేస్తున్న రవితేజ మిస్టర్ బచ్చన్ కంటే ఉస్తాద్ ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. తన నుంచి, నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ ఇంకా రాలేదు కానీ నోటీసు లాంటిది ఏదైనా వస్తేనే రెస్పాండ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
This post was last modified on March 20, 2024 9:53 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…