Political News

పిఠాపురంపై వైసీపీ ప్రత్యేక కన్ను

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపు రం నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ కుయుక్తులు ప‌న్నుతోందా?  ఏదో ఒక విధంగా ఇక్క‌డ జ‌న‌సేన‌ను ఓడించా ల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌హ‌జంగా రాజ‌కీయా ల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వీటిని ఎవ‌రూ కాద‌నరు. కానీ, ప‌నిగ‌ట్టుకుని యుక్తిగా చేసే ప‌నులు మాత్రం చ‌ర్చ‌కు వ‌స్తాయి.

పిఠాపురంలో వైసీపీ త‌ర‌ఫున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె ప‌నితీరు ఇక్క‌డ అంద‌రికీ తెలుసు. నిల‌క‌డ లేని రాజ‌కీయం.. నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వంతో ఆమె రాజ‌కీయాలు చేస్తార‌ని.. కాపు సామాజిక వ‌ర్గం లోనే ఆమె పేరు తెచ్చుకున్నారు. అయినా..  కూడా పార్టీ ఆమెకే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి. మ‌రోవైపు బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో ప‌వ‌న్ పూర్తిగాస‌క్సెస్ అయ్యారు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా టీడీపీ అభ్య‌ర్థి వ‌ర్మ నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను కూడా స‌ర్దు బాటు చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో ప‌వ‌న్ గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా వైసీపీ త‌న రాజ‌కీయాల‌కు కుటిల యుక్తులు జోడించింది. ఎక్క‌డో ఎప్పుడో రాజ‌కీయాలకు దూర‌మైన ఓ మ‌హిళా నేత‌ను తీసుకువ‌చ్చి.. పిలిచి మ‌రీ కండువా క‌ప్పింది. అస‌లు ఆమె రాను మొర్రో నాకు ఇష్టం లేద‌ని చెప్పినా విన‌లేద‌ట‌.

ఆమే మాకినీడు శేషు కుమారి. ఒక‌ప్పుడు ఈమె జ‌న‌సేన‌లోనే ఉన్నారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆమె ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి నాకు రాజ‌కీయాలు వ‌ద్దంటూ.. దూరంగా ఉన్నారు. అయినా.. కానీ, ఇప్పుడు వైసీపీ ప‌ట్టుబ‌ట్టి ఆమెను పిలిచి మ‌రీ పార్టీ తీర్థం ఇచ్చింది. తెర‌వెనుక ఏదో జ‌రిగింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దీంతో ఆమె అయిష్టంగానే పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమెను అడ్డు పెట్టుకుని ఓట్లు చీల్చే ప్ర‌య‌త్నంలో వైసీపీ ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. అస‌లు విష‌యంతెలిసిన జ‌న‌సేన మాత్రం త‌మ‌కేం కాద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 20, 2024 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…

50 minutes ago

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

2 hours ago

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…

2 hours ago

నటి రేప్ కేసు – హీరోపై కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…

3 hours ago

అర్ధరాత్రి షోలు…150 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

3 hours ago