ఔను.. ఇప్పుడు ఈ మాటే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. సీఎం జగన్‌పై అభిమానమో.. లేక వైసీపీ నేతల ప్రలోభాల కారణమో తెలియదు కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలు, కోడ్‌ను కూడా ధిక్కరిస్తూ.. వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, రేషన్ డీలర్లు.. ఇలా దిగువస్తాయి అల్పాదాయ జీవులు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదే.. వీరి జీవితాలకు ఎఫెక్ట్ అయింది. ఎన్నికల సంఘం ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నిఘాకు దిరికిన వారిని సస్పెండ్ చేయడంతో పాటు ఐదేళ్లపాటు వారు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తోంది. దీంతో జగన్‌ను నమ్ముకుంటే జీవితాలు పోతున్నాయ్! అనే టాక్ వినిపిస్తోంది.
ఏం జరిగింది?
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ధిక్కరిస్తూ.. వైసీపీ అనుకూల ప్రచారం చేస్తున్న 30 మందికిపైగా వలంటీర్లు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని అధికారులు డిస్మస్ చేశారు. అంతేకాదు.. వీరిలో ఎవరూ కూడా బవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాయకుండా డీబార్ చేశారు.
— అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సభలో మేమూ సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు.
— కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లని విధుల నుంచి తొలగించారు. ఎమ్మిగనూరు 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన వాలంటీరు నరసింహులును విధుల నుంచి తొలగించారు.
— శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మణికంఠను విధుల నుంచి తొలగించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త మల్లంపేట సచివాలయం పరిధిలోని వాలంటీర్లు బోళెం ఓంకార విజయలక్ష్మి, శింగంపల్లి దుర్గాభవానిని డిస్మిస్ చేశారు.
— తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు మురళిని విధుల నుంచి తప్పించారు. చిత్తూరు జిల్ల జీడీనెల్లూరు నియోజకవర్గంలోని సురేంద్రనగరంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు రఫీని తొలగించారు.
— అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె. రవిని డిస్మిస్ చేశారు. పట్టణ చౌకధరల డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, డీలర్లు వంశీకృష్ణ, కృష్ణమూర్తి, రఫీక్ డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.
— ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ నిర్వహించిన ప్రచారంలో కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. ఈయనను విధుల నుంచి తొలగించారు.
— పొదిలిలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు కుమారుడు కృష్ణచైతన్య వెంట మల్లవరం విద్యుత్తు ఉపకేంద్రం షిప్టు ఆపరేటర్ షేక్ గౌస్ మొహియుద్దీన్ పాల్గొని ప్రచారం చేశారు. ఈయనను తొలగించారు.
— చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వైసీపీ ప్రచారాల్లో పాల్గొన్న కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం చీకటిపల్లి ఉపాధి హామీ వలంటీర్ వెంకటేష్, కుప్పం మండలం సాంకేతిక సహాయకుడు మురుగేష్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు.
This post was last modified on March 20, 2024 3:23 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…