ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరిగి ఆ పార్టీ గూటికి చేరుతున్నారా? రేపోమాపో ఆమె కండువా కప్పుకోవడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పనబాక టీడీపీలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత.. అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ఈ క్రమంలో పనబాక లక్ష్మి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే ఆమె కేంద్రంలోనూ చక్రం తిప్పారు.
తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుని.. తిరుపతి పార్లమెంటుస్థానం నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే.. 2019లో పనబాక ఓటమి పాలయ్యారు. మరోసారి ఆమెకు చంద్రబాబు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో వచ్చిన ఉప పోరులో పనబాక పోటీ చేసినా.. మళ్లీ ఆమె ఓడి పోయారు. కట్ చేస్తే.. ప్రస్తుతం మరోసారి సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్ కూడా వచ్చేసిం ది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. ప్రస్తుతం ఉన్న పోటీలో పనబాక నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థికంగా బలంగానే ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం ఒక తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొంది. దీంతో ఆమె ఆ పోటీని తట్టుకుని గెలుచుకుని రాగలరా? అనేది ప్రధాన ప్రశ్న. ఈ క్రమంలో టీడీపీ అధినేత రెండు నియోజకవర్గాల్లో పనబాక గురించి.. సర్వే నిర్వహించారు. ఈ రెండు చోట్లా కూడా.. పనబాకకు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.
దీంతో పనబాకకు టికెట్ నిరాకరణ తప్పలేదు. అయితే.. పార్టీకోసం సేవ చేస్తే.. ఆమేరకు గుర్తింపు ఉం టుందని మాత్రం హామీ ఇచ్చారు. కానీ, ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అని భావిస్తున్న పనబాక.. పోటీ నుంచి తప్పుకొనేందుకు ఏ మాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో తిరిగి పాతగూటికే చేరుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో పనబాక బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on March 20, 2024 12:51 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…