నగిరి ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా, ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. ముచ్చటగా మూడోసారి నగిరి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేస్తానంటున్నారామె. అయితే, నగిరి సీటు మూడోస్సారి రోజాకి దక్కడానికి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది.
అసలంటూ రోజాకి నగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇంకోసారి ఇస్తే, ఆమెను ఓడించి తీరతామని స్థానిక వైసీపీ నేతలు, వైసీపీ అధినాయకత్వానికి వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చారు. అదేంటో, ఏ పార్టీలో వున్నా ఆమెకు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవుతూ వస్తుంటుంది.
గతంలో పరిస్థితులు వేరు. ఈసారి పరిస్థితులు ఇంకా వేరు.! ఈసారి రోజా గెలవడం దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే, నగిరిలో రోజాని కాదని ఇంకొకరికి సీటు ఇచ్చేంత రిస్క్ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయలేకపోయారు.
టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు రోజా సిద్ధంగా వున్నారన్న అంతర్గత సమాచారం నేపథ్యంలో, వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులేశారు. మరోపక్క, స్థానిక వైసీపీ నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు తెరవెనుకాల పెద్ద కథే నడిపారట రోజా.
ఈ క్రమంలో ప్రస్తుతానికి కాస్త స్తబ్దుగా వుంది, రోజా పట్ల నగిరి వైకాపాలోని అసమ్మతి వర్గం. ఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా వెంట, ఆ అసమ్మతి వర్గం అస్సలు కనిపించే అవకాశం లేదట. అయినాగానీ, రోజా తరఫున ఆమె భర్త సెల్వమణి సహా, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా తెరవెనుక వ్యవహారాల్ని చక్కబెట్టేస్తున్నారు.
సామాజిక వర్గ సమీకరణాలు, సినీ గ్లామర్.. ఇవన్నీ రోజాకి కొంత అడ్వాంటేజ్‌గా మారే అవకాశం లేకపోలేదు. అయితే, సొంత పార్టీలో వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు రోజాకి. కానీ, ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న ధీమా అయితే రోజాలో కనిపిస్తోంది. ఆ మ్యాజిక్ వర్కవుట్ అయితే, రోజా హ్యాట్రిక్ కొట్టినట్లే.!
This post was last modified on March 19, 2024 3:08 pm
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…