బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి గేట్లెత్తినట్లే అనిపిస్తోంది. తాను గేట్లెత్తితో బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో చాలామంది కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారని రేవంత్ ఈమధ్యనే హెచ్చరించారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అప్పుడు కూలిపోతుంది ఇపుడు కూలిపోతుందని కేటీయార్, హరీష్ రావు లాంటి వాళ్ళు పదేపదే శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నా రేవంత్ కమలనాదులను పెద్దగా లక్ష్యపెట్టడంలేదు. అందుకనే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ఒక గేటు ఎత్తినట్లున్నారు.
అందుకనే ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. తొందరలోనే మరో ఏడుగురు ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. గడచిన మూడు నెలలుగా దాదాపు పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ ను కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంఎల్ఏల చేరిక దానంతోనే మొదలైంది. అందుకనే తొందరలోనే కొత్తా ప్రభాకరరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్లం వెంకటరావు, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ఇప్పటికే రేవంత్ తో బేటీ అయ్యున్నారు.
వీరంతా కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారని పార్టీవర్గాల సమాచారం. వీళ్ళతో రేవంత్ ప్రాధమిక చర్చలు పూర్తియపోయాయని మిగిలింది చేరికలు మాత్రమేనట. వాస్తవంగా అయితే ఈ చేరికలు లేదా వలసలు పార్లమెంటు ఎన్నికల తర్వత చేస్తే ఎలాగుంటుందని అధిష్టానంతో రేవంత్ చర్చలు జరిపారట. అయితే బీఆర్ఎస్ నుండి ప్రతిరోజు రెచ్చగొట్టే మాటలు ఎక్కువైపోతున్నాయని రేవంత్ ఫీలవుతున్నారు. అందుకనే బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో చీలిక తెచ్చి బీఆర్ఎస్ఎల్పీని చీల్చేయాలని డిసైడ్ అయ్యారట.
బీఆర్ఎస్ఎల్పీని చీల్చేసి మెజారిటి ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహం. ఎప్పుడైతే దానం కాంగ్రెస్ లో చేరిపోయారో వెంటనే ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ఎల్పీ నేత స్పీకర్ ను కలిసి ఫిర్యాదుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవటంతో సోమవారం మళ్ళీ మరోసారి ప్రయత్నించాలని అనుకున్నారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అనర్హత వేటు పడదని అందరికీ తెలుసు. ఎందుకంటే కేసీయార్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై అనర్హత వేటుకు కాంగ్రెస్ ఎన్ని ఫిర్యాదులిచ్చినా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు కాబట్టే. ఈ ధైర్యంతోనే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఇపుడు ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు.
This post was last modified on March 18, 2024 10:30 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…