Political News

మేం మీ వెంట ఉంటాం:  మొడీ తో చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల‌(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) అజెండా మాత్రం ఒక్క‌టేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన ఎన్డీయే కూట‌మి ప‌క్షాల తొలి బ‌హిరంగ స‌బ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ కార‌ణంగానే దేశానికి ప్ర‌పంచ స్థాయిలో పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. “మోడీ ఒక వ్యక్తి కాదు.. భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి. మోడీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం“ అని కొనియాడారు

మోడీ బ‌ల‌ప‌రిచేందుకు మ‌నమంతా(ఏపీ ప్ర‌జ‌లు)సిద్ధంగా ఉన్నామ‌న్న విష‌యాన్ని క‌ర‌తాళ‌ధ్వ‌నుల ద్వారా ఆయ‌న‌కు తెలపాల‌ని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడి స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీల కార్య‌క‌ర్త‌లు, అబిమానులు త‌ర‌లి వ‌చ్చారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ… ఎన్డీయే కూటమికి అండగా ఉంటామని సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

‘మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి ప్రధాని మోడీ. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పారు మోడీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రధాని మోడీ నినాదాలు. పేదరికం లేని భారత్ అనేది మోడీ కల అని మనకు తెలుసు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోడీ ఆశయాలతో మనమంతా ఏకం కావాలి. సరైన సమయంలో దేశానికి మోడీ లాంటి నేత ప్రధాని అయ్యారు’  అని చంద్రబాబు స‌భ‌లో క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య చెప్పుకొచ్చారు.

ప్ర‌ధానికి అర్థ‌మ‌య్యేలా..

ఈ సందర్భంగా తాను చెప్పేది మోడీకి అర్థం కావడానికి చంద్రబాబు హిందీలో ప్రసంగించారు. “నేను ఈ రోజు ఒకటే చెబుతున్నాను. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వికసిత్ భారత్ ద్వారా మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోడీ గారికే ఉన్నాయి. ప్రపంచంలోనే భారతీయులను ఒక శక్తిమంతమైన జాతిగా తయారు చేయడం కోసం మోడీ, అమిత్ షా కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మేం మీ వెంట ఉంటాం. ఈ మేరకు ఈ సభాముఖంగా మేం మాట ఇస్తున్నాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on March 17, 2024 10:09 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

3 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

5 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

5 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

7 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

8 hours ago