Political News

2019 సెంటిమెంటును రిపీట్ చేసిన జ‌గ‌న్‌

రాజకీయాలంటేనే సెంటిమెంటుతో ముడిప‌డిన వ్య‌వ‌హారం. పార్టీల నుంచి నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ సెంటిమెంటుతోనే ముందుకు సాగుతుంటారు. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ క‌నిపించింది. 2019లో ఏ సెంటిమెంటును అయితే ఆయ‌న పాటించారో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంటును సీఎం జ‌గ‌న్‌రిపీట్ చేశారు. 2019 ఎన్నిక‌లకు ముందు తొలిసారి.. జ‌గ‌న్‌.. త‌న పార్టీ అభ్య‌ర్థుల జాబితాను క‌డ‌ప జిల్లాలోని తన తండ్రి స‌మాధి వ‌ద్ద రిలీజ్ చేశారు.

అది కూడా విడ‌త‌ల వారీగా కాకుండా.. ఒకేసారి సీఎం జ‌గ‌న్ ఈ జాబితాల‌ను విడుద‌ల చేశారు. అసెంబ్లీకి సంబంధించిన 175 నియోజ‌క‌వ ర్గాల‌కుఅభ్య‌ర్థుల‌ను అప్పట్లో ఒకే సారి ప్ర‌క‌టించారు. ఇక పార్ల‌మెంటుకు సంబంధించి కూడా 25 మంది అభ్య‌ర్థుల‌ను కూడా ఒకేసారి విడుద‌ల చేశారు. ముందుగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి వ‌ద్ద ప్ర‌త్యేకంగాప్రార్థ‌న‌లు చేసిన త‌ర్వాత‌.. వైసీపీ అధినేత ఈ జాబితాల‌ను విడుద‌ల చేశారు.

ఇక్క‌డ కూడా మ‌రో సూత్రం పాటించారు. జ‌గ‌న్ త‌న కుడి ప‌క్క‌న బీసీ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ను, ఎడ‌మ ప‌క్క‌న మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాల‌ను విడుద‌ల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధ‌ర్మాన విడుద‌ల చేయ‌గా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చ‌ద‌వి వినిపించారు. ఇక ఆప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది.. పార్ల‌మెంటుకు వ‌చ్చేస‌రికి 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లోనూ ఇదే సెంటిమెంటును సీఎం జ‌గ‌న్ ఫాలో అయ్యారు. త‌న కుడి ప‌క్క‌న బీసీ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ను, ఎడ‌మ ప‌క్క‌న మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాల‌ను విడుద‌ల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధ‌ర్మాన విడుద‌ల చేయ‌గా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చ‌ద‌వి వినిపించారు. యితే.. సీట్ల‌లో మాత్రం బీసీలు, మైనారిటీ, ఎస్సీ, మ‌హిళ‌ల‌కు సీట్లు పెంచారు. మ‌రి ఈ సెంటిమెంటు ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

This post was last modified on March 17, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

1 hour ago

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…

1 hour ago

వీరమల్లుని నిలబెట్టే 7 ఎపిసోడ్లు

అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…

1 hour ago

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

8 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

13 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

16 hours ago