Political News

కేసీఆర్‌కు మ‌రో షాక్‌.. కీల‌క ఎంపీ ఔట్‌

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు.

‘చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదిం చాలని విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ అని రంజిత్ రెడ్డి తెలిపారు. కాగా, త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే, లోక్ సభ ఎన్నికల ముందు ఇలా బీఆర్ ఎస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండ‌డంతో పార్టీ ప‌రిస్థితిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శనివారం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అనంతరం, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరారు.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి, 3 రోజుల క్రితమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు యత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు ఆయన్ను అడ్డుకు న్నారు. అనంతరం కేసీఆర్ తో సమావేశమైన ఆయన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. తర్వాత, బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది.

అటు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు హస్తం గూటికి చేరగా.. తాజాగా, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఆయన్ను బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇన్ని జ‌రుగుతున్నా.. బీఆర్ ఎస్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 17, 2024 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

4 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

7 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

8 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

9 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

10 hours ago