Political News

ఢిల్లీలో ఏపీ భ‌వ‌న్ విభ‌జ‌న‌.. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

స‌రిగ్గా పార్ల‌మెంటు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నాలుగు గంట‌ల త‌ర్వాత‌.. అంటే శ‌నివారం రాత్రి 8-9 గంట‌ల మ‌ధ్యలో కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనికి మ‌రో ప్రాతిప‌దిక కూడా ఉంది. ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం ప‌ర్య‌టించారు. నాగ‌ర్ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌భ పెట్టారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న ఈ మాట అని.. అలా వెళ్లారో లేదో.. ఆ వెంట‌నే కేంద్రం నుంచి రాత్రి 9గంట‌ల స‌మ‌యంలో ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అదే ఢిల్లీలో గ‌త ప‌దేళ్లుగా ఎటూ కొలిక్కిరాని ఏపీ భ‌వ‌న్ విభ‌జ‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ భ‌వ‌న్‌ను విభ‌జిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

ఎవ‌రెవ‌రికి ఎలా ఎలా.?

తెలంగాణ‌కు:  8.254 ఎకరాలు రానున్నాయి. ఇందులో శబరి బ్లాక్‌లో మూడు ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు రానుంది.

ఏపీకి: 11.536 ఎకరాలు వస్తుంది. 5.781 ఎకరాల్లో ఉన్న స్వర్ణముఖి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.259 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి వస్తుంది.  ఈ విభ‌జ‌న కేవ‌లం జ‌నాభా ప్రాతిప‌దిక‌న మాత్రమే జ‌రిగింది. అది కూడా.. గ‌త విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేరకు, రెండు తెలుగు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి వ‌చ్చిన మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా కేంద్ర హోం శాఖ స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కాగా, తెలంగాణ‌లో పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీ.. దీనిని తెలంగాణ ప్ర‌యోజ‌నంగా ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 16, 2024 11:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: AP Bhavan

Recent Posts

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

30 minutes ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

35 minutes ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

1 hour ago

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…

1 hour ago

అమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో…

3 hours ago

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే…

3 hours ago