ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కవితను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 18 నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. 7 రోజులపాటు కవితను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హైదరాబాదులో కవితను అరెస్టు చేసిన అధికారులు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఇక, ఈరోజు ఉదయం కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనది అక్రమ అరెస్టు అని, దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని కవిత అన్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు.
కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ ఇంకా విచారణలోనే ఉందని, కవిత అరెస్టు చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపులో కవిత కీలక సూత్రధారి అని ఈడీ తరఫు లాయర్లు వాదించారు. అందుకే ఆమెను మరింత విచారణ జరిపేందుకు కస్టడీకి అప్పగించాలని వాదనలు వినిపించారు.
మరోవైపు, కవితను అరెస్టు చేసే సమయంలో ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేటప్పుడు తమ విధులకు కేటీఆర్ ఆటంకం కలిగించారంటూ మహిళా అధికారి భానుప్రియ మీనా ఫిర్యాదు చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు భారీ ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరట.
This post was last modified on March 16, 2024 6:07 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…