తన సోదరి, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా అరెస్టు చేస్తారంటూ వారిని ప్రశ్నించారు. ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. చాలా సేపు వారిని అధికారులు ఇంట్లోకి అనుమతించలేదు. విచారణ ముగిసిన తర్వాత కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
“సోదాలు పూర్తయ్యాయి. అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకుం జారీ చేశారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు?“ అని కేటీఆర్ వారిని నిలదీశారు. సుప్రీంకోర్టులో ఒక మాట చెప్పి.. ఇప్పుడు మరో విధంగా ఎలా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు. అయితే.. అధికారులు ఈ వాదనను రికార్డు చేసుకున్నారు. తమకు విధులకు అడ్డు తగిలితే.. కేసు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో కేటీఆర్ వెనక్కి తగ్గారు.
హుటాహుటిన ఢిల్లీకి
కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను హుటా హుటిన ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి 8.45 గంటల ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. కవితను ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు.
ఇదిలావుంటే, కవిత అరెస్ట్ విషయం తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత నివాసానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు చేరుకున్నారు. దీనిపై ఎలా ముందుకు సాగాలనే విషయంపై చర్చిస్తున్నారు.
This post was last modified on March 15, 2024 10:33 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…