యాదృచ్ఛికమా.. కావాలని చేశారా? అనేది పక్కన పెడితే.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టిన సమయంలో ఇటు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన(ఇప్పుడు కాదు) కేసీఆర్ తనయ, బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారు లు అరెస్టు చేయడం సరికొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి.. ఆమెను నిందితు రాలిగా పేర్కొన్న అధికారులు.. అనేక సందర్భాల్లో విచారించారు. మూడు సార్లు ఆమెను విచారించారు. ఆమె ఇంటికి వచ్చి మరీ విచారించారు. తర్వాత.. ఢిల్లీకి పిలిచి మరీ విచారణ చేపట్టారు.
తర్వాత మరోసారి ఇంకోసారి విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే.. పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను ప్రచా రానికి వెళ్లాల్సి ఉందని, బీఆర్ ఎస్ నాయకురాలిగా తనకు ఆ బాధ్యత అప్పగించారని ఆమె విన్నవిస్తూ వచ్చారు. అయినప్ప టికీ.. అనూహ్యంగా ఆమెను ఈడీ అధికారులు ఉరుములు లేని పిడుగు మాదిరిగా అరెస్టు చేయడం గమనార్హం. అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం చేయాలని నిర్ణయించారు.
మీర్జాల గూడలో రోడ్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా కవితను అరెస్టు చేయడం.. ఏం సందేశం ఇస్తోందనేది ప్రధానం. ప్రధాని మోడీతనతో పెట్టుకున్న వారిని ఇలానే అరెస్టు చేయడం గమనార్హం. కొన్ని వారాలా కిందట జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను కూడా ఇలానే పార్లమెంటు ఎన్నికల ముందు అరెస్టు చేశారు. అప్పుడు కూడా.. తెల్లవారితే ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. పర్యటించారు కూడా. అప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రచార వస్తువుగా చేసుకున్నారు. ఇక, ఇప్పుడు కవిత అరెస్టును కూడా ఆయన ప్రచార వస్తువుగా చేసుకునే వ్యూహంలో భాగమే ఆ మె అరెస్టు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.
This post was last modified on March 15, 2024 8:01 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…