వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఇంకా ప్రచారం ప్రారంభించ లేదు..కానీ, 17వ తేదీ నిర్వహించే బొప్పూడి సభ తర్వాత.. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నా రు. అయితే.. ఈ కూటమి బలాబలాలపై ఇప్పటికేకొన్ని సర్వేలు వచ్చాయి. ఏబీపీ-సీ ఓటరు సర్వే తాజాగా ఎన్డీయే బలంగా దూసుకుపోతుందని చెప్పింది.
పార్లమెంటు ఎన్నికల్లో 20 స్థానాలను ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందని తేల్చి చెప్పింది. కట్ చేస్తే.. ‘న్యూస్ 18’ అనే మరో సంస్థ కూడా.. కూటమికి 18 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని, ఓటు బ్యాంకులో మాత్రం మార్పు లేదని పేర్కొంది. దీంతో కూటమిలో ఆశలు చిగురించాయి. గెలుపుపై ఆశలు పెరిగాయి. ఇదిలావుంటే, వైసీపీ ఊరుకుంటుందా? బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు జత కట్టిన వెంటనే వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్వేల్లో కూటమి బలం ఎంత? వ్యక్తుల పరంగా నాయకుల బలం ఎలా ఉంది? అనే విషయాలపై సంపూర్ణంగా ఆరా తీయడం గమనార్హం. ఈ సర్వేల్లో వ్యక్తుల బలం విషయానికి వస్తే.. చంద్రబాబుపై సింపతీపాళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో చంద్రబాబు దూరదృష్టి గురించి చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఆయన వస్తే.. రాష్ట్రంలో అబివృద్ధి జరుగుతుందనే విషయంపై ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారట.
ఇక, పవన్ వస్తే.. అవినీతిని ప్రశ్నించడంతోపాటు.. ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేయడంతోపాటు.. కొన్నికొన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన దోహదపడతారనే చర్చ సాగుతున్నట్టు వైసీపీ గుర్తించింది. అయితే.. ఇదే సర్వేలో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలిసిందని వైసీపీ నాయకులు అంటున్నారు. పురందేశ్వరి ఇమేజ్ జీరోగా కనిపించిందని చెబుతున్నారు.
ఇక, కూటమి పరంగా మాత్రం ప్రజల్లో సానుకూలత ఉందని తెలుస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల బలంతోనే కూటమిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాదనేది వైసీపీ గ్రహించిందనేది సారాంశం. దీనికి తగిన విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on March 15, 2024 10:27 am
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…