Political News

#WhoKilledBabi కు 5 ఏళ్ళు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అంత పాశవికంగా ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్నది ఇప్పటికీ తేలకపోవడం శోచనీయం.

మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు మిస్టరీలా మారింది.? ఈ చిక్కుముడిని సీబీఐ సైతం ఎందుకు విప్పలేకపోతోంది.? వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారా.? ఆయనకు వేరే మహిళతో అక్రమ సంబంధం వుందా.?

కడప ఎంపీ టిక్కెట్టుని ఆశించడం వల్లే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారా.? ఇంకేవైనా వేరే కారణాలు వివేకానంద రెడ్డి హత్య వెనుక వున్నాయా.? దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినా సీబీఐ, ఈ కేసులోని చిక్కు ముడులను విప్పలేకపోతోందంటే, ఆశ్చర్యకరమే అది.

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె న్యాయ పోరాటం వల్లనే, ఈ కేసు ఇంకా సజీవంగా వుంది. అసలంటూ ఆమె గట్టిగా నిలబడటం వల్లే, గుండె పోటు వ్యవహారం కాస్తా, గొడ్డలి పోటు అని తేలింది. అత్యంత కిరాతకంగా దుండగులు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే, అత్యంత భయానకమైన రీతిలో వున్న క్రైమ్ సీన్‌ని చూసి, గుండె పోటుగా తొలుత ఎందుకు ప్రచారం చేశారన్నదే ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం.

ఏళ్ళకేళ్ళు గడచిపోతున్నా, డెత్ మిస్టరీ అయితే వీడటంలేదు. ఐదేళ్ళు అంటే చిన్న విషయం కాదు. మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి హత్యకు గురైతే, ఆ కేసులో నిజానిజాలు తేలేందుకు ఐదేళ్ళు సరిపోనప్పుడు సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది.?

2019 ఎన్నికల సమయంలో హత్య జరిగితే, 2024 ఎన్నికల సమయంలో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. కానీ, నిజాలు నిగ్గుతేలడంలేదు. ఈ జాప్యానికి కారణమెవరు.? అసలు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రాజకీయంగా లాభం పొందినదెవరు?

This post was last modified on March 14, 2024 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాట్ టాపిక్ – గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఓపెనింగ్

నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…

53 minutes ago

ఫ్యాక్షన్ నేతలకు ఈ టీడీపీ యువ నేత ఆదర్శం

రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…

54 minutes ago

ఆ ఘటన కలచివేసింది: బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…

1 hour ago

మరింత పెద్దదౌతున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…

1 hour ago

పవన్ ను ఉద్దేశించి మాట్లాడలేదన్న బీఆర్ నాయుడు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…

10 hours ago

నా గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారు: పవన్

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…

12 hours ago